మెగ కోడలు ఉపాసనకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు చరణ్ భార్యగా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ కోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ మరో పక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్, యాక్టివేటర్గా ఎన్నో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మెగా కోడలు తరచు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేస్తుంది.
తాజాగా మెగా ఫాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది ఉపాసన. ఇంతకీ మెగా కోడలు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎంటో ఒకసారి చూద్దాం. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తనే క్లింకారా. క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందంటూ ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ వచ్చారు. ఏ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ క్లింకారా ఫేస్ రివిల్ చేయకుండా హైడ్ చేస్తూ వస్తున్నారు చరణ్, ఉపాసన. ఎన్నోసార్లు మెగా ఫ్యాన్స్ వాళ్లకు రిక్వెస్ట్ పెట్టిన దానికి ఫలితం లేకుండా పోయింది.
ఫస్ట్ ఇయర్ బర్త్ డే కైనా ప్రిన్సెస్ పేస్ ను రివిల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. అయితే తాజాగా ఉపాసన తన కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేయకున్నా.. తను రెడ్ కలర్ డ్రెస్ ధరించి రాంచరణ్ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా డాక్యుమెంటరీని చూస్తూ కేరింతలు కొడుతున్న వీడియోను రిలీజ్ చేసింది. తండ్రిని మొదటిసారి టీవీలో చూసి క్లింకారా ఎంతో ఎగ్జైట్ అయిందంటూ వెల్లడించింది. మాటలు రాకుండా కేరింతల కొడుతూ ఆనంద పడుతున్న ఈ చిన్నదాని వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ వీడియోని చూసిన మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తూ రామ్ చరణ్‌కు విషెస్ తెలియజేస్తున్నారు.