నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
దానికి తగ్గట్టు ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా.. ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనగనగా ఓ రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా.. మాలాంటి వాళ్లకు మాత్రం ఆయన మహారాజు అంటూ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభించారు. ఇక ఇప్పటికే సినిమా ఓ పాపను బేస్ చేసుకుని హైలైట్ అవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌తో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్య తన పేరు చెప్పగానే.. నీకు నువ్వే జీ అని పెట్టేసుకుంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా.. చెప్పింది వినాలి.. ఇచ్చింది తీసుకోవాలి అని ఆ పాప చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాలో యాక్షన్, ఫైట్ సీన్స్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. మాస్ ఆడియన్స్‌కు బాలయ్య డాకు మహారాజ్ పండగే. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్ అనేలా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ అడవిలో పులి, ఎలుగుబంటి వస్తే ఎలా అంటే.. కింగ్ ఆఫ్ జంగిల్ ఎక్కడ ఉన్నాడమ్మా అంటూ ఆ పాప చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ట్రైలర్.. బాలయ్య అభిమానుల్లో మరింత ఆశక్తి పెంచేసింది. ఈ సినిమాతో మరోసారి బాలయ్య హ్యాట్రిక్‌కు నాంది పలకడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్ లాంటి సినిమా అంటూ.. బాలయ్య మరోసారి బ్లాక్‌బస్టర్ కొటాడంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్.