టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్‌లో నటిస్తున్నాడు. తర్వాత హనురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. ప్రభాస్. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కోలుకున వెంటనే రాజాసాబ్ మూవీ షూట్ పూర్తిచేసి ఫౌజి సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు ప్రభాస్.
ఇక ఈ సినిమాను భారత స్వతంత్రానికి ముందు జరిగిన యదార్థ ప్రేమ కథగా రూపొందించనునట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఈ మూవీలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. త్వరలో కొత్త షెడ్యూల్ తమిళనాడు మదురై సమీపంలో మొదలుకానుందని.. అక్కడ దాదాపు 20 డేస్ దేవిపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ప్రభాస్ నటించనున్నాడని తెలుస్తుంది.
ఇమన్వి హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ సత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. ప్రస్తుతం ప్రభాస్ రోల్‌కు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవడంతో ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. మా డార్లింగ్ కటౌట్‌కి ఆ రోల్ సూట్ అవ్వదని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు ప్రభాస్ ఏ పాత్రలో అయినా అవలీలగా నటించేయగలడు.. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం పక్కా అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ రోల్ పై వస్తున్న ఈ న్యూస్‌లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.