టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. బడా నిర్మాతలకు మైండ్ బ్లాక్..!

గ‌త కొద్ది గంటలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాములు నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లతో పాటు.. వారి కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాల నిర్వహించారు. 55 ప్రాంతాల్లో ఈ తనికీలు జరుగుతున్నాయని సమాచారం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకోవడం అందరికి షాక్ కలిగిస్తుంది.

Income Tax Raids on Pushpa 2 Producers - TrackTollywood

దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం భారీ సక్సెస్ సాధించి రెండు వందల కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను కొల్లగొట్టింది. ఆయన కుమార్తె హన్సితా రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులందరి ఇళ్లల్లో ఐటీ అధికారులు తనికీలు మొదలుపెట్టారు. ఈ దాడులు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యంగా నిలిచారు. పుష్ప 2లాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకున్న మైత్రి నవీన్, చెర్రీ ఇళ్లల్లో ఐటీ సోదాలు మొదలయ్యాయి.

Singer Sunitha | Zee News Telugu

ఐటి దాడులు అకస్మకంగానే ప్రారంభించినా.. దిల్ రాజు, మైత్రి మేకర్స్ లాంటి ప్రముఖుల పై వచ్చిన ఆరోపణలు వాటి ఆధారంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎక్కువ బడ్జెట్‌తో నిర్మాణాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై ఐటి శాఖ దృష్టి సారించిందట‌. దిల్ రాజు నిర్మించిన ఎన్నో సినిమాలు ఇటీవల రిలీజ్ అయ్యాయి. అలాగే మైత్రి మేకర్స్ కూడా వరుస సినిమాలను టాలీవుడ్ లో రూపొందిస్తూనే ఉంది. ఇక మైత్రి మేకర్స్‌ నవీన్, చెర్రీ, దిల్ రాజులతో పాటు సింగర్ సునీత భ‌ర్త ఇంటి వద్ద కూడా ఐటీ దాడులు జ‌రుపుతున్నార‌ని సమాచారం. ఈ దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.