కమెడియన్ అలీ సినిమాల్లో విక్రమ్ విలన్‌గా నటించాడని తెలుసా.. ఆ మూవీ ఇదే..!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్.. చివరిగా పా. రంజిత్ డైరెక్షన్‌లో తంగలాన్‌ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో.. ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకున్నా.. ఆడియన్స్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే విక్రమ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. విక్రమ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఏఎన్ఆర్‌తో కలిసి నటించారు.

Ooha (film) - Wikipedia

అక్కినేని నటించిన బంగారు కుటుంబం సినిమాల్లో విక్రమ్ నటించగా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో శ్రీకాంత్ సతీమణి ఊహతో కూడా తెలుగులో విక్ర‌మ్ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఊహ సినిమాలోను వీరిద్దరూ కలిసి కనిపించారు. అయితే ఊహ హీరోయిన్‌గా కనిపించగా.. విలన్ పాత్రలో విక్రమ్ మెరిసాడు. ఇక శివాల ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో కమెడియన్ అలీ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విక్రమ్‌ పలు తెలుగు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు.

Actor Vikram says Thangalaan part two to be made soon

ఈ క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ఆయన నటించినా తమిళ్ సినిమాలు తెలుగులోనూ డ‌బ్ అయ్యి మంచి స‌క్స‌స్ అందుకుంటున్నాయి. తమిళ్‌లో కాశి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్.. ఆ సినిమా నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియా స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూనే.. హీరోగా అవకాశాలు ద‌క్కించుకుని సౌత్ స్టార్ హీరోగా తన సత్తా చాటుతున్నాడు.