సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నిన్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండ‌స్ట్రీ సెల‌బ్రెటీస్ అంతా డ్రగ్స్‌ నివారణకు స‌పోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్ల‌డించారు. ఈ భేటి త‌ర్వాత దిల్ రాజు మీడియాతో స్వ‌యంగా ఈ విష‌యాని వెల్ల‌డించాడు.

Say No to Drugs ❌ Prabhas | TFPC

ఈ క్రమంలోనే తమ వంతుగా స్టార్ హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు.. డ్రగ్స్ నివారణకు వ్యతిరేకంగా వీడియోలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అలా మొద‌ట‌ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ డ్రగ్స్ వ్యతిరేకంగా 30 సెకండ్ల వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో రెబెల్ స్టార్ మనకు ఎన్నో అలవాట్లు ఉండగా.. ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియోలు విడుదల చేశాడు.

Say No To Drugs - @jrntr , #AllHailTheTiger , #JrNTR #NTR #ManOfMassesNTR #Dragon , #Devara #FearSong #Tarak #War2 #Telugu, #NTRNeel #Chuttamalle #Telangana #AndhraPradesh

దీంతో ప్రభాస్ కు సపోర్ట్ చేస్తూ ఆయన ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తూ డ్ర‌గ్స్‌ నివారించాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరో స్టార్ హీరో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా తనదైన స్టైల్ లో వీడియోను విడుదల చేశాడు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం, కొనడం, వినియోగించడం చేస్తుంటే.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కి సమాచారం అందించాలని.. డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండాల‌ని తనదైన స్టైల్ లో ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ విడియో వైర‌ల్‌గా మారుతుంది.