సాయి పల్లవికి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ఎంత స్పెషల్ అంటే..?

టాలీవుడ్ న్యాచురల్‌బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వం తోను.. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అసలు సాయి పల్లవి ఏం చదువుకుంది.. ఇండస్ట్రీ ఎంట్రీ ఎలా ఇచ్చింది.. ఆమె టెస్ట్ ఏంటి.. ఫుడ్ ఏంటి.. తను సినిమాలు చూస్తుందా.. తన ఫేవరెట్ నటినట్టులు ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి ఎంతో మందిలో ఉంటుంది.

Mammootty (@mammukka) / X

ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీటిపై తెగ సెర్చింగ్ చేస్తూ ఉంటారు. కాగా ఇటీవల కొత్త సంవత్సరానికి అంతా నాంది పలికిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అంత పబ్స్‌, పార్టీస్, రిసార్ట్స్‌ అంటూ గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేసుకుంటే.. సాయి పల్లవి ఎంతో ట్రెడిషనల్ గా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పింది. పద్ధతిగా సాయిబాబా టెంపుల్ లో తన న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు అందరితోను ప్రశంసలు అందుకుంటుంది. అయితే కోట్లాదిమంది అభిమానించే ఈ అమ్మ‌డి ఫేవరెట్ హీరో ఎవరై ఉంటారని అంశం నెటింట ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కాగా.. గతంలో సాయి పల్లవి తన ఫేవరెట్ హీరో ఎవరనే విషయాన్ని స్వయంగా వెల్లడించింది. మా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఎవరో చెప్పుకొచ్చింది. సిమ్రాన్ నటన, డ్యాన్సింగ్ స్టైల్ ని తను బాగా ఇష్టపడతాన‌ని వెల్లడించిన సాయి పల్లవి.. మెయిల్ యాక్టర్‌లలో మమ్ముట్టి యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ స్టైల్.. చాలా ఇష్టమంటూ వెల్లడించింది. తను చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయిన వెంటనే చూసేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు క‌మ‌ల్ ఎంత స్పెష‌ల్ అంటే ఇప్పటికీ తన పర్సనల్ డైరీలో కమల్ హాసన్ ఫోటో దాచుకుంద‌ట‌. ప్రస్తుతం సాయి పల్లవి కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారుతుంది.