మరో వివాదంలో చిక్కుకున్న బన్ని.. గాలికి పోయేదాన్ని తగిలించుకున్నాడే..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేట‌ర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఒక రోజు రాత్రంతా చర్లపల్లి జైల్లోనే ఉంచేశారు.

భారీ ట్విస్టుల క్రమంలో అల్లు అర్జున్.. జైలు నుంచి బయటకు వచ్చాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట‌ ఘటనలో.. నాంపల్లి కోర్టు బన్నీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచికతలు సమర్పించాలని ఆదేశించిన కోర్ట్.. సాక్షులను ప్రభావితం చేయవద్దని.. కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని క్లారిటీ ఇచ్చేసింది. ఇక రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి కోర్ట్‌ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి క్రమంలో బన్నీ మరో వివాదంల్లో చిక్కుకున్నాడు.

Allu Arjun's Pushpa 2 breaks Baahubali 2's record, earns Rs1760 crore

తాజాగా పుష్ప 2, బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్ పెట్టి.. ఓ రీల్ చేస్తూ అందులో పుష్ప.. బాహుబలిని ఎగిరి తన్నినట్లుగా మీమ్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్. అలాంటి మీమ్‌ను అల్లు అర్జున్ లైక్ చేయడం వివాదంగా మారింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. ఇప్పుడున్న రేట్లు ఏంటి.. అప్పుడున్న టికెట్ రేట్లు ఏంటి.. అసలు సంబంధం ఉందా.. అయినా ఈ రికార్డును బ్రేక్ చేయడానికి నీకు ఇంతకాలం పట్టిందా అంటూ.. రకరకాలుగా ఫైర్ అవుతున్నారు. దీనిపై బన్నీ అభిమానుల సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే వివాదం నుంచి తప్పుకుంటున్నావు అన్న ఇలాంటివి అవసరమా అంటూ.. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.