టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ అంతా మళ్ళి ఈ అమ్మడు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల బయట బ్యానర్లలో సమంత సినిమాలేవి కమిట్ అవ్వడంలేదు. వచ్చిన వాటిని కూడా రిజెక్ట్ చేస్తూ వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ని కొద్ది నెలల క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ట్రలాల మూవింగ్ పిక్చర్స్ పెరిటా ఓ బ్యానర్ స్థాపించిన శ్యామ్.. మా ఇంటి బంగారం అనే సినిమాను కూడా అనౌన్స్ చేసింది. ఇందులో తానే ప్రధాన పాత్రలో కనిపించనుంది. సినిమా ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తుందట. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే 7 నెలలు గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు మళ్ళీ సమంత నా ఇంటి బంగారం మూవీపై ఎలాంటి అప్డేట్ అందించలేదు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? మెయిన్ క్యాస్ట్ ఏంటి.. అసలు సినిమా సెట్స్ కు వెళ్లిందా లేదా.. అనే వాటిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. అసలు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ లెక్క బయటకు రాకుండా సీక్రెట్ మైంటైన్ చేస్తున్న శ్యామ్.. ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులను ఎక్కువగా ముంబై నుంచే నడిపిస్తుందని సమాచారం.
ఇక సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ కూడా అక్కడే జరుపుకుందట. కొంతకాలంగా ముంబై లోనే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. హైదరాబాద్ కి రావడమే తగ్గించేసిం.ది కావాల్సిన సినిమా ఈవెంట్లకు అది కూడా వాళ్ళు ఆహ్వానిస్తే తప్పక మెరుస్తుంది. టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు నటించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో.. రక్త బ్రహ్మండ్.. ది బ్లడి కింగ్ డమ్ వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీ గా గడుపుతున్న సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం కూడా తగ్గించేసింది. ఫోటోషూట్‌లు కూడా బాగా తగ్గించేసింది. చివరిగా ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించిన సమంత.. తర్వాత ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి చికిత్స పూర్తయిన వెంటనే.. ముంబైలో మక్కాం పెట్టేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు శ్యామ్ ముంబై ని విడిచిపెట్టలేదు.