ఆగ‌ని బాల‌య్య ఊచ‌కోత‌.. డాకు మ‌హ‌రాజ్ 8వ రోజు వ‌సూళ్లు ఎన్ని కోట్లంటే..?

గాడ్ అఫ్ మాసెస్‌ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబోలో తాజా మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు కొలగొడుతుంది. గత ఎనిమిది రోజులుగా వ‌సూళ‌తో సంచలనం సృష్టిస్తున్న బాలయ్య ఇప్పటికీ అదే ఊచకోత కొనసాగిస్తున్నాడు.

Daku Maharaj Trailer Released: Balakrishna's Intense Performance as a  Master of Killing Gives Goosebumps

సుమారుగా రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ప్రమోషనల్‌ కంటెంట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. రిలీజ్ బిజినెస్ అదే లెవెల్లో జరిగింది. ఆంధ్ర, నైజాం కలిపి రూ.68 కోట్లు, ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల రూ.16 కోట్ల మేర బిజినెస్ జరగగా.. సినిమా మొత్తం బిజినెస్ రూ.84 కోట్లుగా తెలుస్తుంది. దీంతో సినిమా రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో జర్నీని మొదలుపెట్టింది. సుమారు 1600 స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లలో మొదటి రోజు నుంచి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు రూ.25.5 కోట్లు, రెండవ రోజు రూ.13 కోట్లు, మూడో రోజు రూ.12 కోట్లు, నాలుగో రోజు రూ.10 కోట్లు, ఐదవ రోజు రూ.6.5 కోట్లు, ఆరవ రోజు రూ.4.5 కోట్లు, ఏడవ రోజు రూ.4 కోట్లు నికర కలెక్షన్లు సాధిస్తూ వచ్చిన ఈ సినిమా.. అలా మొదటి వారం మొత్తం మీద రూ.75.5 కోట్ల వస్తువులను సొంతం చేసుకుంది.

Day 1: Daaku Maharaaj gets a $1 million opening | Telugu Cinema

ఇక ఎనిమిదో రోజు ఆదివారం ఈ సినిమాకు గ్రాండ్ గా కలెక్షన్లు నమోదు అయినట్లు తెలుస్తుంది. సినిమా సుమారు 5 కోట్ల రూపాయలను నికరంగా వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు వివరించాయి. దాంతో ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసిందని.. సినిమా బ్రేక్ ఇవన్‌ను సాధించి లాభాల జోన్కు అడుగు పెట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. గత ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన‌ట్లు ఏపీ, నైజంలో రూ.105 కోట్లు గ్రాస్ ఇతర రాష్ట్రాల్లో రూ.8 కోట్లు ఓవర్సీస్‌లో రూ.17 కోట్లు సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడగా కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా లాంగ్ రన్‌లో భారీ లాభాలు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.