టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ పేరుపై ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్. ఒకప్పుడు ఆయన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్‌లో ఉండేది. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డుల పరంగా ఇప్పటికీ సంచలన సృష్టిస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ రూ.100 కోట్ల షేర్ రికార్డ్ కేవలం చిరంజీవి వాల్తేరు వీరయ్యతో అందుకున్నారు. రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసిన మొదటి సీనియర్ హీరోగా రికార్డును క్రియేట్ చేశాడు.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కేవలం చిరుకి మాత్రమే సాధ్యమైన ఆ రేర్ రికార్డ్‌ను టచ్ చేయడం విశేషం. సంక్రాంతికి రిలీజై అదిరిపోయే వసూళతో దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూడవ రోజుకే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేయగా.. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మైలురాయిని దాటేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన సంక్రాంతికి వస్తున్నాం.. మరోసారి రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ క్రేజ్ చూస్తుంటే సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రసర్‌గా నిలవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ డ్రీమ్ రన్ ఇలాగే కొంతకాలం కొనసాగితే.. ఫుల్ రన్‌లో రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ టాక్ నడుస్తుంది. ఆదివారం రెండు రాష్ట్రాల్లోనే కాక.. ఓవర్సీస్‌లో సైతం హౌస్ ఫుల్‌తో దూసుకుపోయిన ఈ సినిమాకు.. ఈవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి పోటి లేకపోవడంతో.. రెండో వీకెండ్ అయ్యే వరకు కూడా ఈ సినిమా ఊపు కొనసాగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం క్యూ కడుతున్న క్రమంలో.. ఫుల్ రన్‌లో ఏ రేంజ్ వసూలు కొల్లగొడుతుందో వేచి చూడాలి.