” పుష్ప 2 ” కి చిరు సపోర్ట్.. అల్లు vs మెగా వార్‌కి చెక్ పడినట్టేనా..?

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా వ‌ర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్‌ జోరుగా సాగుతుందన్న సంగ‌తి అందరికీ తెలిసిందే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమ‌నేంతలా వారి మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక.. కొందరు మెగ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్‌గానే పుష్ప 2ను అట్టర్ ఫ్లాప్ చేసి తీరుతామంటూ సవాళ్లు విసురుతున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి అప్డేట్స్ వచ్చినా అందులో నెగటివ్ ఎక్కువగా ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఫైనల్లీ మెగా వర్సెస్ అల్లు వార్‌కు చెక్ ప‌డేలా అల్లు అరవింద్ ఓ ప్లాన్ వేశాడంటూ ఒక టాక్‌ నడుస్తుంది.

ఇలా వార్ ని కొనసాగిస్తూ పోతే.. ఇటు మెగా వారసుడు చరణ్, అటు అల్లు వారసుడు బన్నీ ఇద్దరి కెరీర్‌కు దెబ్బవుతుంది అన్న ఆలోచ‌న‌లో అల్లు అరవింద్ ఓ మెట్టు దిగి బన్నీ చేత చిరుకి ఫోన్ చేసి.. తన ప్రమోషనల్ ఈవెంట్‌లో హాజరుకావాలని అడిగాడట. దానికి చిరు రియాక్ట్ అవుతూ ప్రస్తుతం ఉన్న‌ బిజీలో ఈవెంట్ కు రావడం కుదరదని కానీ.. నేను కూడా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం చిన్న వీడియో రూపంలో సపోర్ట్ అందిస్తానని వెల్లడించాడట. దీనంతటికీ కారణం చిరు భార్య సురేఖ అంటూ కూడా వార్త వైర‌ల్ అవుతుంది.

Megastar Chiranjeevi To Be Awarded IIFA Utsavam Special Honour For  'Outstanding Achievement In Indian Cinema' - NewsX World

మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన సినిమాకు తన భర్త, కొడుకు వల్ల ఎలాంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతోనే.. చిరుని ఒప్పించి.. మెగా, అల్లు వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. చిరు, బన్నీకి సపోర్ట్ గా పుష్ప 2 ప్రమోషనల్ వీడియో షేర్ చేస్తే మాత్రం.. మెగా వర్సెస్ అల్లు వార్‌కు కచ్చితంగా చెక్ పడే అవకాశం ఉంది.