బోయపాటి కాదు.. నాకు నేనే పోటీ.. డైరెక్టర్ బాబి సెన్సేషనల్ కామెంట్స్.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను, బాబి ఇద్ద‌రు దిట్ట‌ల‌న‌డంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో యాక్షన్ సినిమాలు తెర‌కెక్కించి.. బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అనుకోవడంలో వారికి వారే సాటి. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మేకింగ్ స్టైల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే ఉంటారు. ఈ క్రమంలోనే.. బాలయ్యకు బోయపాటి వరుసగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. త్వరలోనే అఖండ తాండవంతో నాలుగో సినిమాను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన చేతుల్లోనే డబల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

Struggling director's story for Balayya-Boyapati film? - TeluguBulletin.com

ఇక డైరెక్టర్ బాబి.. సీనియర్ హీరోలకు తనదైన స్టైల్ లో సక్సెస్ లో అందిస్తూ మంచి ఫ్రేమ్ సంపాదించుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాకు మహారాజ్‌తో బాలయ్యకు అంతకుమించి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని బాబి ఫిక్స్ అయ్యాడు. ఇక.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 12న‌ ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే తాజాగా.. డాకు మహారాజ్ ప్ర‌స్మీట్‌లో బాబి సందడి చేశాడు. ఇందులో భాగంగా మీడియా నుంచి బోయపాటి సినిమాలకు పోటీగా.. డాకు మహారాజు ఉంటుందా అనే ప్రశ్న బాబీకి ఎదురు అయింది.

Music Director SS Thaman & Director Bobby Fun at Daku Maharaj Event -  YouTube

దీనిపై బాబీ రియాక్ట్ అవుతూ.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ని ప్రస్తావించారు. ఇప్పటికీ మూడు సక్సెస్ లు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. అంత గొప్ప కాంబినేషన్ వాళ్ళిద్దరిది. అలాంటి బోయపాటి గారికి.. నేనెలా పోటీ అవుతా.. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. నాకంటూ నాదో సపరేట్ స్టైల్. నేను ఎవ్వరికీ పోటీ కాదు. ఎవరి మేకింగ్ స్టైల్ వాళ్లది. ఎవరి సినిమాలు వాళ్ళవి. కానీ.. గ‌త‌ సినిమాల కంటే బెటర్ గా చేయాలని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. పాత సక్సెస్ ని రీ టెస్ట్‌ చేసుకొని నెక్స్ట్ సినిమాలపై కాన్సెంట్రేట్ చేస్తా. ఏం మార్చాలి అన్నది తెలుసుకొని ముందుకు వెళతా. ఇక ఇక్కడ అప్డేట్ అన్నది చాలా ముఖ్యం అంటూ బాబి వెల్లడించాడు. ప్రస్తుతం బాబీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.