” గేమ్ ఛేంజర్ ” కు రంగస్థలం సెంటిమెంట్ ఫాలో అవుతున్న చరణ్.. హిట్ పక్కానా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్.. మరి కొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానుంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వాన్ని నటించగా.. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, జయరాం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు.

Game Changer (2025) - News - IMDb

ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో తాజాగా ప్రమోషన్స్ కూడా స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా డల్లాస్ లో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన స్టేడియం, దిల్ రాజు, సుకుమార్ కామెంట్స్.. రాంచరణ్ ఎంట్రీ.. ఆయ‌న కామెంట్స్‌ వీడియోలు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి.

Pawan Kalyan heaps praise on Ram Charan at Rangasthalam success meet |  Events Movie News - Times of India

ఇకపోతే.. జనవరి నెలలో ఈ మూవీ యూనిట్ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్స్‌ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు అని.. దానికి పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. గతంలో చర‌ణ్‌ నటించిన రంగస్థలం సినిమా.. సక్సెస్ మీట్‌కు పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ రిలీజ్ ఈవెంట్‌కు కూడా.. పవన్ కళ్యాణ్‌ని మేకర్స్ పిలవనున్నారని.. రంగస్థలం సినిమా సెంటిమెంట్ చరణ్ ఫాలో అవ్వన్నాడంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్స్‌. రంగస్థలం సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ పక్క అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.