ప్రస్తుతం మోహన్ బాబు మీడియా పై దాడి, హత్యాయత్నం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో మోహన్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పెట్టేసిన తెలంగాణ హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఇటీవల మంచు ఫ్యామిలీ వివాద క్రమంలో మోహన్ బాబుని ప్రశ్నించేందుకు జర్నలిస్టులు ఆయన వద్దకు వెళ్ళగా.. ఆగ్రహంతో ఆయన ఒక ప్రముఖ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడంతో.. మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. కాగా మోహన్ బాబు ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలా చేసుకున్నారు. దీనిపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది.
మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నానని అఫీడవిట్ దాఖలు చేశాడు. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అందులో వివరించాడు. ఇక ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన తరఫు లాయర్ వాదన వినిపించగా.. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి రియాక్ట్ అయ్యారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించమని కోరగా.. మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్‌ను జీపీ కోర్టుకు సమర్పించింది. వాదనలు అనంతరం బెయిల్ పిటీషన్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది.
జల్‌పల్లి లోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచి మనోజ్ మీడియాను తీసుకుని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళగా.. ఈ క్రమంలోనే ఆవేశంలో ఉన్న మోహన్ బాబు తన స్పందన తెలుసుకోవడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేశాడు. ఇందులో ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఇప్పటికే కేసు ఫైల్ చేశారు పోలీసులు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం మోహన్ బాబు విజ్ఞప్తిని రిజెక్ట్ చేసింది.
మరోవైపు మోహన్ బాబు మనోజ్ వివాదం ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో పాటు జర్నలిస్టుపై దాడి కేసులో మరో కేస్ ఫైల్ చేసామని చట్ట ప్రకారం చర్యలు తప్పవంటూ తాజాగా తెలంగాణ డీజీపీ జితేంద్ర వెల్లడించాడు. జల్లపల్లిలో మీడియా పై దాడి, హత్యాయత్నం కేసులో ఇంకా ఎంక్వయిరీ మొదలు కాలేదని.. డిసెంబర్ 24 వరకు ఆయనకు సమయం ఉంది అంటూ చెప్పకు వచ్చారు. అయితే ఇలాంటి క్రమంలో హైకోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడంతో మోహన్ బాబు.. బుధవారం పోలీసుల విచారణకు హాజరు కాక తప్పదని తెలుస్తుంది.