నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డాకు మహారాజ్. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్, ప్రధాన పాత్రలలో చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య డాకు మహారాజ్ తో మరో హ్యాట్రిక్‌కు నాంది పలకనున్నాడని అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే మేకర్స్ తాజాగా ఈ సినిమా బుకింగ్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇంతకీ బుకింగ్స్ ఏ ఏరియాలలో ప్రారంభించారు.. ఎక్కడెక్కడ.. ఎన్ని షోలు పడనున్నాయో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా డాకు మహారాజ్.. యూఎస్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం 29 ప్రాంతాల్లో.. 77 షోలకు సంబంధించిన బుకింగ్స్ మొదలుపెట్టారని.. నెక్స్ట్ మరిన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్యకు ఉన్న క్రేజ్ రిత్యా.. యూఎస్ మార్కెట్లో కూడా డాకు మహారాజ్ కు మంచి ఓపెనింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాతో బాలయ్య సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని.. మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకని హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడతాడంటూ ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కూడా బాలయ్య గత సినిమాలకు సంగీత దర్శకుడుగా వ్యవహరించిన థమన్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై.. సూర్యదేవర రాఘవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. బాలయ్య మరో హ్యాట్రిక్ కు దారి వేస్తాడో లేదో వేచి చూడాలి.