బన్నీ – త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ గా ఆ స్టార్ బ్యూటీ.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు కల్లగొట్టి అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తున్న పుష్ప 2 ఫుల్ రన్‌ ముగ్గువకముందే సెకండ్ పొజిషన్ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 2000 కోట్ల రన్ వైపు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న పుష్పరాజ్ నెక్స్ట్‌ చేయబోయే సినిమా ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ నెల‌కొంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాటల మాంత్రికుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక గతంలో త్రివిక్రమ్, బ‌న్నీ కాంబోలో ఏకంగా మూడు సినిమాల రిలీజ్ అయి మూడు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలవైకుంఠపురంలో సినిమాతో ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్లు కూడా సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌. కాగా త్రివిక్రమ్ నుంచి చివరిగా వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం మాత్రం.. కారణం ఏదైనా.. రొటీన్ రొట్టె స్టోరీ అనే టాకా రావడంతో ఊహించిన సక్సెస్ అందుకోలేక ఫ్లాప్‌గా మిగిలింది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యాన్స్‌లో కాస్త సందేహాం ఉన్నా.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అంతేకాదు నెక్స్ట్ వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం త్రివిక్రమ్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను మెప్పించేలా పక్కా ప్లాన్ తో కథలు సిద్ధం చేసుకున్నాడని సమాచారం.

ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి. వీళ్ళ సినిమా తొందర్లోనే స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అల్లు అర్జున్ కూడా ఈ విషయం మీద త్రివిక్రమ్ కు పూర్తి బాధ్యత అప్పగించినట్లు సమాచారం. దీంతో.. మీనాక్షి చౌదరిని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండేలా కథను రాసుకున్నాడని తెలుస్తుంది. మరి రెండవ హీరోయిన్ ఎవరిని తీసుకుంటున్నారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్‌తో మీనాక్షి చౌదరికి మంచి ఇమేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకు తెలుగులోనే కాదు మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలోనూ మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరిని తీసుకుంటే ఇక్కడ ఇండస్ట్రీలలో సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చాలా వరకు మార్కెట్ విషయంలో కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో త్రివిక్రమ్.. మీనాక్షిని ప్రిఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సెకండ్ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.