స్టార్ హీరో ఇంటి కోడలిగా రోజా కూతురు.. ఆమె టార్గెట్ వేరే లెవెల్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రోజాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓవైపు రాజకీయాల్లో.. మరోవైపు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకుంది. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లోకి రాకముందే కూచిపూడి పై ప్రావీణ్యత పొంది.. ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చి.. అంద‌రి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి క్రమంలోనే నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రేమ తప్పస్సు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అవకాశాన్ని కొట్టేసింది. తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. దీంతో ఒకసారిగా అమ్మడికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

మినిష్టర్ రోజా కూతురు అన్షు మాలిక సినీ ఎంట్రీకి అంతా సిద్ధం.. హీరో ఎవరంటే..?

ఇక.. బాలయ్య భైరవద్వీపం సినిమాతో అమ్మడి కెరీర్ పూర్తిగా టర్న్ అయింది. తర్వాత ఎంతమంది స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైం లో.. డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత రాజకీయాలపై మక్కువతో టీడీపీలో చేరింది. మహిళా అధ్యక్షురాలుగా మంచి స్టేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. 2009లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత కొన్ని రోజులకు టీడీపీ వీడి.. వైసీపీతో చేతులు కలిపింది. అలా.. 2014లో పార్టీలో అభ్యర్థిగా గెలిచింది. తర్వాత 2014లోనూ సక్సెస్ అందుకోవడంతో ఏపీఐఐసీ చైర్మన్ మంత్రిగా కూడా వ్యవహరించింది. ఇక తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో.. రాజకీయాల్లో కామ్ అయిన రోజా.. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో రోజా కూతురు అన్షూ మాలికకు సంబంధించిన న్యూస్ వైర‌ల్ అవుతుంది.

రోజా కూతురు అన్షు మాలిక ఎంత అందంగా ఉందో.. పిక్స్ వైరల్..

తాజాగా ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. మీ అమ్మాయి అన్షూ మాలిక ఓ స్టార్ హీరో కోడలు కాబోతుందా.. అని యాంకర్ ప్రశ్నించగా మొదట ఈ విషయం విన్న రోజా ఆశ్చర్యపోయింది. ఇదంతా కేవలం ఒక రూమర్ అని.. ప్రస్తుతం అన్షు చదువు కోసం యూఎస్ కు వెళ్లిందని వెల్లడించింది. అయినా కూడా తన కూతురు యాక్టింగ్, డాన్స్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్ళింది అంటూ వార్తలు వస్తున్నాయ‌ని.. తను నటించాలనుకుంటే నాకు చాలా హ్య‌పి. కానీ.. తను సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది. మా ఇష్టలు వాళ్ళపై రుద్దడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా తన సైంటిస్ట్ చదువు కోసమే యూఎస్ కు వెళ్లిందంటూ.. రోజా వెల్లడించింది. దీంతో రోజా కూతురు స్టార్ హీరో కోడలు కాబోతుంది అనే వార్తలకు చేక్ ప‌డింది. ఇక అన్షూ మాలిక మాత్రం రోజాకు మించిన అందంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే త‌న‌కు సంబంధించిన ఎన్నో ఫొటోస్, వీడియోస్‌ వైరల్ గా మారుతున్నాయి.