టాలీవుడ్ దిగ్గజ నటుడు ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన సినిమాలతో ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైనా ఏఎన్నార్.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి ఏఎన్నార్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ప్రేమాభిషేకం కూడా ఒకటి. 1981లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసింది. కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. దాదాపు 60 సంవత్సరాల వయసులో లవర్ బాయ్ గా ఏఎన్నార్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాంటి లెక్కలు మించి రికార్డులు క్రియేట్ చేసిన ప్రేమాభిషేకం సినిమా షూట్ మధ్యలోనే ఆపేయాలని భావించారట.
ఇక ఈ మూవీ డైరెక్టర్ దాసరి నారాయణరావుకు అక్కినేని నటించిన దేవదాసు, బాటసారి సినిమాలు ఫేవరెట్ మూవీస్. ఈ క్రమంలోనే దాసరి.. దేవదాసు తరహాలో మరో సినిమాను ఏఎన్ఆర్ తో తర్కెక్కించాలని అనుకున్నాడట. అలా దేవదాసు మళ్లీ పుట్టాడు సినిమాను తరికెక్కించారు. అయితే అప్పట్లో చాలామంది ప్రేమాభిషేకం సినిమాను కూడా దేవదాసు మళ్ళీ తీస్తున్నారని భావించారట. 50% షూటింగ్ పూర్తి అయిన తర్వాత అక్కినేని బంధువు అయినా ఒక ఆయన ఏలూరు నుంచి హైదరాబాద్కు వచ్చి.. ఆయనతో డిస్కస్ చేశారట. అక్కినేని కి ఆయన అంటే ఎంతో గౌరవం. ఆయన మాటపై పట్టు ఉండడంతో.. ప్రేమాభిషేకం ప్రస్తావన వచ్చినప్పుడు ఏఎన్ఆర్.. దాసరి మళ్లీ దేవదాసు సినిమానే తీస్తున్నాడని భావించారట. అదే విషయాన్ని బంధువు కూడా ఫీలయ్యాడు.
వీళ్ళిద్దరే కాదు.. దాదాపు సెట్లో ఉండే 60 మంది సభ్యులు ఇదే ఫీల్ అయ్యారట. అలా అక్కినేని బంధువు ఇప్పటివరకు తీసిన ఫుటేజ్ అంతా తగలబెట్టేసేయండి.. ఏదైతే అదవుతుంది అంటూ దాసరి నారాయణరావు సన్నిహితుడైన ఓ వ్యక్తికి సజెస్ట్ చేశారట. దానికి ఆ వ్యక్తి షాక్ అయ్యి దాదాపు రూపొందించిన సినిమాను తగలబెడితే ఏమొస్తుంది.. ఏదైతే అది అవుతుంది అది జనం వద్దకు వెళ్లాలి అని ఆయనకు నచ్చ చెప్పాడట. ఇక దాసరికి ఈ విషయం తెలియడంతో.. అక్కినేని కూడా ఇలాంటి భావనలో ఉన్నారా అని ఆశ్చర్యపోయాడట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలని కసితో తెరకెక్కించారట. అలా తను అనుకున్న అవుట్ ఫుట్ వచ్చేవరకు ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కథ, మాటలు.. ఇలా ప్రతి దానిలోను జాగ్రత్త వహిస్తూ చివరికి సక్సెస్ అందుకున్నాడు.