టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ రాణిస్తున్న వారిలో.. కొంతమంది వైవిధ్యమైన పాత్రలను ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్లని వాళ్లు తమ కష్టంతో స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాలో బిజీగా గడుపుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఒకడు. పుష్పాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ కట్స్ అసలు క్లారిటీ లేకుండా గజిబిజిగా అనిపించడంతో.. నిన్న మొన్నటి వరకు ఆడియన్స్ లో ఉన్న అంచనాలన్నీ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో బన్నీ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా.. అసలు సక్సెస్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక పుష్ప 2తో మరోసారి బన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే పాన్ ఇండియా లెవెల్లో ఆయన పేరు మోత మోగిపోతుంది.
ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా రూ.2000 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని అంచనాలు వినబడుతున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా టార్గెట్ ను అస్సలు పుష్పరాజ్ రీచ్ అవుతాడా.. వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమాలో కంటెంట్ ఉందా.. లేదా.. అనే ప్రశ్నలు వెలబడుతున్నాయి. అయితే సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా కంటెంట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.