టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవరలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించారు. ఈ సెప్టెంబర్ 27న భారీ అంచనాలతో రిలీజైన దేవర మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి లాభాల బాటలో అడుగుపెట్టిన దేవర.. తెలుగులో ప్రమోషనల్ ఈవెంట్ జరుపుకోలేదని తెలిసిందే. సినిమా రిలీజ్ కి మందు ప్రమోషనల్ ఈవెంట్ మేకర్స్ ఏర్పాటుచేసిన.. ఏవో కారణాలతో దాన్ని ఆపేయాల్సి వచ్చింది. అయినా దేవర ఘన విజయాన్ని సాధించింది.
అంతేకాదు ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంద దేవర. విజయం సాధించినా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించకపోవడంపై తారక్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం పోస్టులు పెడుతూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగు వంశీ రియాక్ట్ అవుతూ చేసిన ట్విట్ వైరల్ గా మారింది. దేవర బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడం చాలా ఆనందంగా ఉందని. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తారక్ ఫ్యాన్స్ కోసం దేవర విజయోత్సవ వేడుకలు గ్రాండ్గా జరుపుకోవాలని.. ఈవెంట్ నిర్వహించాలని మీరు మొండిగా పట్టుపట్టారు.
అయితే మేము ప్రయత్నాలు చేసినా దసరా, దేవి నవరాత్రులు ఉత్సవాల కారణంగా ఈ సక్సెస్ మీట్ వేడుకల కోసం తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు దక్కలేదు. పరిస్థితి మా చేతుల్లో లేదు. ఈవెంట్ నిర్వహించలేకపోయినందుకు ఎన్టీఆర్ అభిమానులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు హృదయపూర్వక క్షమాపణల కోరుతున్న అంటూ నాగవంశీ ట్విట్ చేశాడు. అయినా మేము ఇంకా దానికి కోసమే ప్రయత్నిస్తున్నాం అంటూ వెల్లడించాడు. బ్లాక్ బస్టర్ దేవరను.. తారక్ అన్నని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే శక్తి మీకు ఉందని మాకు తెలుసు. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ ట్విట్ చేశాడు నాగ వంశీ. ప్రస్తుతం నాగ వంశీ ట్విట్ వైరల్ అవ్వడంతో అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.