టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐటెం గర్ల్‌గా సమంత నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాకు ఇది ఏ రేంజ్ లో హైలెట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పుష్పాకు సీక్వెల్గా వస్తున్న పుష్పా 2 సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఐటమ్ బ్యూటీగా ఎవరు ఉండబోతున్నారని చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటికే ఐటెం సాంగ్ లో ఆ హీరోయిన్ నటించబోతుందంటూ ఎంతోమంది పేర్లు వైరల్ అయ్యాయి. కానీ.. అసలు ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం ఇప్పటివరకు తేల్చలేదు. ఇలాంటి క్రమంలో ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ని ఐటమ్ గర్ల్ గా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
అయితే గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి. యానిమల్ తర్వాత త్రిప్తి నటించబోతుందంటూ.. తర్వాత జాన్వి కపూర్ ఇలా ఎంతోమంది పేర్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు మళ్లీ సమంతనే ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుందంటూ టాక్ కూడా నడిచింది. కానీ.. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఫైనల్ గా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు ఫిక్స్ చేశారట. ఈ అమ్మడు అయితే దాదాపు ఫిక్స్ అయిపోయిందట. ప్రభాస్ తో కలిసి సాహోలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కు బాగా సెట్ అవుతుందని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2 బాలీవుడ్ లో రిలీజై ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. డ్యాన్స్ విషయంలోనూ శ్రద్ధ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి క్రమంలో ఈ హాట్ బ్యూటీ అయితే పుష్ప రాజ్‌కు పర్ఫెక్ట్ కూడా.. బాలీవుడ్ లో మరింత హైప్ పెరుగుతుంది.. అలాగే కుర్ర కారు బాగా ఎంటర్టైన్ అవుతారు అనే ఉద్దేశంతో శ్రద్ధ కపూర్ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఎలాగూ సాహో సినిమాతో శ్రద్ధ తెలుగులో పరిచయం అయింది. కనుక అన్ని విధాలుగా ఈ అమ్మడు అయితే బాగుంటుందని మేకర్స్.. శ్రద్ధ కపూర్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇక ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 డిసెంబర్ 6న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈసారి పుష్పరాజ్ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తాడో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడండి.