టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరు వినిపించేది. అయితే ఒక్కసారి కొరటాల కెరీర్‌లో ఆచార్య సినిమా వచ్చి మొత్తం రికార్డ్ అంతా రివర్స్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే పేరు డిజాస్టర్ డైరెక్టర్‌గా మారిపోయింది. తర్వాత దేవర సినిమాతో మళ్ళీ కెరీర్‌ను కాపాడుకొని సక్సెస్ బాటలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ కొరటాలకు విమర్శలు తప్పలేదు. ఈ సినిమాలో కూడా రచన, డైరెక్షన్ బాగోలేదంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. కేవలం ఎన్టీఆర్ నటన వల్లె సినిమా సక్సెస్ అందుకుందని.. తారక్ దేవర సినిమాను కాపాడాడంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం తారక్ కారణంగానే కొరటాల శివ ఈసారి డిజాస్టర్ నుంచి బయటపడ్డాడు అంటూ.. ఆచార్యలో పొదగటం అనే పదం పదేపదే వాడినట్లు.. దేవరలో ఎర్ర సముద్రం అనే పదం పదే పదే వాడి చిరాకు పెట్టారని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
అసలు కొరటాల శివ ఆచార్య ముందు వరకు కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎలా ఇమేజ్ సంపాదించుకోగలిగాడో ఆశ్చర్యంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే కొరటాల ఈ స్టేజికి చేరుకోవడానికి ప్రభాస్, తారక్‌లతో ఉన్న మంచి బాండింగే కారణం అని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొరటాల కమ్యూనిటీ సిద్ధాంతాలు నమ్మే సోషల్ యాక్టివిస్ట్‌ల కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తన కెరీర్‌ను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా మొదలుపెట్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కెరీర్ చాలా ప్రొఫెటబుల్గా సాగే టైంలో నాకు నచ్చిన లైఫ్ ఇది కాదు అనుకున్నారు. తర్వాత తన అంకుల్ పోసాని కృష్ణ మురళి దగ్గర సినిమాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా పని చేశాడు. అలా సినీ కెరీర్ ప్రారంభించి తర్వాత ఒకడున్నాడు, భద్ర, మున్న, బృందావనం, ఊసరవెల్లి ఇలా ఎన్నో సినిమాలకు అద్భుతమైన డైలాగులను అందించాడు.
మున్నా సినిమా సమయంలో ప్రభాస్‌తో ఏర్పడిన స్నేహంతో.. అలాగే బృందావనం, ఊసరవెల్లి టైంలో డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న క్రమంలో ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహంతో కొరటాల తన కెరీర్ మలుచుకోవడం ప్రారంభించాడు. మొదట మిర్చి కథతో సినిమాకు ప్రభాస్‌ని ఓపించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రభాస్ క్యారెక్టర్జేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మూవీలో మంచి సోషల్ మెసేజ్ కూడా వచ్చేలా కొరటాల సినిమాను తెరకెక్కించాడు. దీంతో ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్ కథ వినిపించగా కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఇన్నాళ్లకు దేవర సినిమా కోసం కొరటాలకు అవకాశాన్ని ఇచ్చాడు.
అయితే ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా వారిద్దరితో తెరకెక్కించిన సినిమాలతో కొరటాలకు స్టార్ హీరోగా ఇమేజ్ వచ్చిందని.. కొరటాల శివ లైఫ్ టర్న్ చేసిందని.. పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఈయన రెండు సినిమాలను తరికేక్కించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అవి కూడా కొరటాల కెరీర్ మైలురాళ్లుగా నిలిచాయి, ఈ క్రమంలోనే ఒకరి స్నేహంతో లైఫ్ టర్న్ అయిపోతుంది అనడానికి కొరటాల శివ జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.