తారక్ ‘ దేవర ‘ కు ఊహించని టాక్.. అతనే పెద్ద విలన్.. !

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలాగా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్ కి ముందే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కొద్దిగా సేపటి క్రితం రిలీజ్ అయిన దేవర మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దేవర ప్రీమియర్ షోలు పడ్డాయి. పలుచోట్ల బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా చూసిన అభిమానులు దేవరపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా అనిపించిందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాలకి హైలెట్ గా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు.

Devara Trailer Review: Jr NTR's Screen Presence Shines With Saif Ali Khan's Mysterious Aura

ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే విపరీతంగా ఆకట్టుకుంటుందట. కానీ.. సెకండ్ హాఫ్ లో సినిమా గాడి తప్పిందని.. కథ తేలిపోయిందంటూ వివ‌రిస్తున్నారు. ముఖ్యంగా జాన్వికపూర్ వచ్చే సీన్స్ బోర్ కొట్టించాయి అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జాన్వి పాత్రకు ప్రాధాన్యత ఉండదని.. కేవలం అందాలకు, గ్లామర్, డ్యాన్స్‌కు మాత్రమే తను పరిమితమైందని.. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ అస్సలు ఆకట్టుకోలేకపోయాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బింగ్ అసలు సెట్ కాలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనిరుధ్‌ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగా ఉందంటూ చెబుతున్నారు.

ఎన్టీఆర్‌తో జ‌ర్నీ నాకెప్పుడూ స్పెష‌లే - దర్శ‌కుడు కొర‌టాల శివ‌ - Telugu States News

వచ్చే సీన్లకు అనిరుధ్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏమాత్రం సెట్ కాలేదట. అయితే చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ డైరెక్టర్ కొరటాల సినిమాకు పెద్దవిలన్‌ అంటూ ఫస్ట్ హాఫ్ బాగా హ్యాండిల్ చేసిన.. సెకండ్ హాఫ్ డీలపడడానికి కొరటాల కారణమంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ హాఫ్ చూసినా అభిమానులు నిరాశ చెందడమే కాదు.. చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా అందరూ ఊహించినట్లే ఉందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమాల రెండు భాగాలుగా తెర‌కెక్కించాలని ఎందుకు అనుకున్నారు అర్థం కావడం లేదని.. రెండు పార్ట్‌లుగా సరిపోయే కథ కాదు అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు వస్తే కానీ సినిమా పూర్తి రిజల్ట్ తెలియదు.