దేవర లో ఆ సీన్స్ కాపీ కొట్టారు.. చట్టపరమైన చర్యలు తప్పవు.. డైరెక్టర్ శంకర్..

ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ రిత్య.. ఏ సినిమాలో అయినా సన్నివేశాన్ని కాపీ కొడితే ఈజీగా దొరికిపోతారు. ఒకవేళ ఒక సినిమాలో సీనుకు మరొక సినిమాలోని సీన్‌కు దగ్గర పోలికలు ఉన్న దాన్ని కాపీ అని నెటిజన్స్ ప్రకటించేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర ట్రైలర్ పై ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాఫీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దేవ‌ర‌ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా.. దేవర గురించి డైరెక్టుగా ఆయన చెప్పకపోయినా.. తను చేసిన కామెంట్స్ పరోక్షంగా దేవరను ఉద్దేశించి ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కనున్న దేవర సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో సెకండ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇది రిలీజ్ అయిన కొద్దిసేపటికి తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంక‌ర్‌ చేసిన ట్విట్ వైరల్‌గా మారింది.

అందరి విన్నపం నేను ఎస్‌యూ వెంక‌టేష‌న్‌ రచించిన ఐకానిక్ నవల వీర యోగ నాయక్ పారి సినిమా కాపీ రైట్ హోల్డర్. ఈ నవలలో చాలా సీన్స్ ని తీసి నా పర్మిషన్ లేకుండా.. చాలా సినిమాల్లో ఇతరులు ఉపయోగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల రిలీజైన ఓ ట్రైలర్లో నవల లోని కీలక సీన్స్ చూసి చాలా బాధపడ్డా.. ఈ నవల లోని సీన్స్ సినిమాల్లో, వెబ్ సిరీస్ లో, ఇంకా ఏ ఇతర మద్యమాల్లో కూడా ఉపయోగించకుండా ఉండాలని భావిస్తున్న. క్రియేటర్స్ దగ్గర ఉన్న రైట్స్ ను గౌరవించి.. అధికారం లేకుండా సీన్స్ ను కాపీ కొట్టడం మానుకోండి. లేదా చట్టరీత్యామైన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చాడు శంక‌ర్‌. పర్మిషన్ లేకుండా చాలా సినిమాల్లో ఇతరులు ఈ సీన్స్ ఉపయోగిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిలో మూవీ ట్రైలర్ గురించి మాట్లాడేరే కానీ ఏ మూవీ అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.

director shankar | తెలుగు360

ఈ క్రమంలో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అని ఆయన మాట్లాడడంతో ఆయన దేవర గురించే మాట్లాడుతున్నారని.. కాపీ కొట్టిన నవల లోని సీన్స్ ను డీ కోడ్ చేసే ప్రయత్నాలు మునిగిపోయారు నెటిజ‌న్లు. దేవర గురించే శంకర్ ట్విట్ చేసుంటార‌ని.. అంత డైరెక్ట్ గా ఆయన ఎలా కామెంట్స్ చేయగలిగారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఎంతో కాలం క్రితం ఈ న‌వ‌ల‌ కాపీరైట్స్ సొంతం చేసుకున్న శంకర్.. ఆ కథ ఆధారంగా ఓ భారీ బడ్జెట్ సినిమాని రూపొందించాలనుకున్నాడట. కానీ.. ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. తర్వాత ఇండియన్ 2 రూపొందించి ఫ్లాప్‌ మూటగ‌ట్టుకున్నాడు. ఇక ఈయన ప్రస్తుతం రాంచరణ్‌తో గేమ్ ఛేంజర్‌ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అన్ని సందేహం ప్రేక్షకులను ఉంది. ఇలాంటి క్రమంలో శంకర్ చేసిన పోస్ట్‌ నెట్టింట మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.