మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టి.. తమ సత్తా చాటుతున్న యంగ్ హీరోలను, దర్శకులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. వారు తీసిన సినిమాల్లో కంటెంట్ ఉందనిపిస్తే.. ఆ సినిమా నచ్చితే కచ్చితంగా వాళ్లను ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తారు. అయితే గతంలో చిరంజీవి ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు తన ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు కాదు. ఇక చిరు ఎంత సన్నిహితంగా ఉండే సీనియర్ నెటులలో సాయికుమార్ కూడా ఒకడు. చిరుని.. సాయికుమార్ ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. అయితే సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ పోలీస్ స్టోరీ. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో రీమేక్ చేశారు. ఇక అప్పట్లో సాయికుమార్ చిరంజీవితో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
పోలీస్ స్టోరీ తెలుగులో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు పబ్లిసిటీ కావాలి. అందుకోసం ముందుగా సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేశాం. రామానాయుడు, ఎస్. వి. కృష్ణారెడ్డి లాంటి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. కానీ.. ఇంకా పెద్ద హీరో ఎవరైన వస్తే బాగుంటుందని అంతా భావించం. దీంతో చిరు అన్నను పిలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళాం. పోలీస్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతుంది మీరు సినిమా చూసి వీడియో బైట్ ఇస్తే బాగుంటుందని ఎంతో రిక్వెస్ట్ చేశా.. అయితే చిరంజీవి గారు దానికి ఒప్పుకోలేదు. నేను చాలా బిజీగా ఉన్నాను సాయి.. అలాంటివి నేను చెయ్యను.. నేను వీడియో బైట్ ఇస్తే ఫ్యాన్స్ నమ్మి సినిమా చూస్తారు. బాగోకపోతే వాళ్లు నన్ను తప్పుగా భావిస్తారు. అందుకే వద్దని వివరించారట. నా తమ్ముడు పవన్ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అమ్మాయి సినిమాకు కూడా వీడియో బయట అడిగారు నేను వద్దని చెప్పేసా.
సినిమా టాక్ జనాల నుంచి రావాలని చిరంజీవి చెప్పుకొచ్చాడట. దీంతో సాయికుమార్ సరే అన్నయ్య మీరు సినిమా చూడండి. నచ్చితేనే వీడియో ఇవ్వండి అని చెప్పానని.. ఇరకాటంలో పెట్టేసావు కదరా.. సరే అలాగే అని చిరు అన్నాడట. ఓవైపు సెలబ్రిటీలకు 6 గంటల షో మొదలైంది. హైదరాబాద్‌లో ఉన్నది ఒక్కటే ప్రింట్. దీంతో చిరంజీవికి మరోచోట ఏడు గంటలకి షో ఏర్పాటు చేసాం. ఇక ఆ ధియేటర్ నుంచి ఈ ధియేటర్ కి ఈ థియేటర్ నుంచి ఆ థియేటర్ కి నేనే రీల్ ని బైక్ లో మార్చేవాడిని. షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి వచ్చేసారు. అలసిపోయి సెట్ లో రిలాక్స్ గా కూర్చున్నారు. ఆయన భార్య సురేఖ కూడా వచ్చారు. సినిమా మొదలయ్యాక రిలాక్స్ గా కూర్చున్న ఆయన అటెన్షన్ తో సినిమా ఇన్వాల్వ్ అయ్యి చూశారు. సినిమా పూర్తయింది ఒకసారిగా నా భుజంపై చేయి వేసి.. ఎంతో అద్భుతంగా నటించావు అని ప్రశంసించారు. మూవీ ఆయనకు విపరీతంగా నచ్చేసింది అంటూ సాయికుమార్ చెప్పుకొచ్చాడు.