టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన ప్రతి సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే గత కొంతకాలంగా రవితేజ రెంజ్‌కు తగ్గ విధంగా ఒక్క సరైన హిట్ కూడా పడకపోబడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ లాస్ట్ ఏడు సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు నెటింట వైరల్ గా మారాయి. ఆ డిటేయిల్స్ ఒకసారి తెలుసుకుందాం.
మిస్టర్ బచ్చన్:
మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్.
ఈగల్:
ఈ ఏడాదిలో రవితేజ నుంచి రిలీజ్ అయిన మరో మూవీ ఈగల్. ఇక ఈగల్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో మొత్తంగా రూ.21 కోట్ల రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
టైగర్ నాగేశ్వరరావు:
రవితేజ నుంచి ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయిన మరో మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమామొత్తం రూ.37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది
రావణాసుర:
డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించిన రావణాసుర మూవీలో రవితేజ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
ధమాకా:
మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన మూవీ ధమాకా. త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో రూ.18.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్లు జరిగాయి.
రామారావు ఆన్ డ్యూటీ:
శరత్ మండుగా డైరెక్షన్లో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన సంగతి తెలిసిందే. రాజేష్ విజయన్, దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ రూ.17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఖిలాడి :
రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ రూ.22.8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్రాక్:
రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన క్రాక్ మూవీకి గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే మొదట ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో రూ.17 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.