సినీ ప్రియులంతా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది.. సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఏంటి.. సినిమాలు ఎంత రాబట్టాయి.. అనే ఆసక్తి ఎప్పటికప్పుడు సినీప్రియలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ :
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో రూ.51.04 కోట్ల షేర్ కొల్లగొట్టి హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలో మొదటి వరుసలో నిలిచింది.
బాహుబలి 2: ఈ మూవీ కూడా రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమానే. ఇక ఈ సినిమా లాంగ్‌రన్‌లో రూ.34.75 కోట్ల షేర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది.
సల్లార 1: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది చివర్లో రిలీజైంది ఇక ఈ మూవీ సీడెడ్ ఏరియాలో ఏకంగా రూ.22.75 కోట్ల షేర్ వసూళను దక్కించుకుంది.
బాహుబలి 1:
రాజమౌళి డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 1 సినిమా సీడెడ్ లో రిలీజై.. లాంగ్ రన్ లో ఏకంగా రూ.21.8 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.
కల్కి 2898 ఏడి:
ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సీడెడ్‌లో రూ.21.20 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది.
సైరా నరసింహా రెడ్డి:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన సినిమాకు సీటర్ ఏరియాలో లాంగ్ రన్‌లో రూ.19.11 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
వాల్తేరు వీరయ్య:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సీడెడ్ లో రూ.19.35 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.
అలా వైకుంఠపురంలో:
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సీడెడ్ ఏరియా లాంగ్ రన్ లో రూ.19.27 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది.
రంగస్థలం:
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా సీడీడ్‌లో లాంగ్‌రన్‌లో రూ.17.70 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది.
అరవింద సమేత:
నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన అరవింద సమేత సినిమాకు సీడెడ్ ఏరియాలో మొత్తం కలిపి రూ.17.64 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.