ఇంద్రజను షూట్ లొకేషన్ లో ఆ వ్యక్తి అంతలా వేధించాడా.. ఏం జరిగిందంటే..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇంద్రజ తల్లి, వదిన, అక్క‌ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై ప‌లు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. యాంకర్ గా కూడా రాణిస్తుంది. ఇక తాజాగా ఇంద్రజ నటించిన మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాలో రావు రమేష్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత కుమార్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఆక ఈ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చింది. ఇక ఈ సినిమాలో రావు రమేష్ భార్యగా ఇంద్రజ నటించి మెప్పించింది.

 అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఇంద్రజ చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇండస్ట్రీలో సెన్సేషనల్‌గా మారాయి. ఇటీవల ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. షూటింగ్ లోకేషన్ తో పాటు.. ఆ సినిమా షూట్ టైంలో అవాంతరాలు సృష్టిస్తూ పెర్ఫార్మన్స్ చేయకుండా షూటింగ్ లొకేషన్లో అనీజీ వాతావరణం క్రియేట్ చేసి వేధించే మనుషుల మధ్యన రావు రమేష్ గారితో సినిమా నటించడం నాకు చాలా కంఫర్ట్ గా అనిపించిందంటూ వివరించింది. దాంతో సినీ ఇండస్ట్రీలో ఈ బ్య‌క్తి ఎవ‌రై ఉంటార‌నే హాట్ డిస్కషన్ మొదలైంది.

ఇదిలా ఉంటే మరోసారి తాజాగా జరిగిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం థాంక్స్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గ్గా మారాయి. సినీ ఇండస్ట్రీలో మెయిల్ పాత్రలకు లభించిన ఇంపార్టెన్స్.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మహిళలకు దొరకవు అంటూ చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలో మహిళలు అందరి తరపున నేను ఇది చెప్తున్నా. మాకు ఉన్న అతి తక్కువ స్కోప్ లో మేము మమ్మల్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. మా ఫిమేల్ ఆర్టిస్టుల్లో కూడా మంచి సత్తా ఉన్నా వారు చాలామంది ఉన్నారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ మూవీ షూట్ టైంలో ఆమె వేదించిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం ఇంద్రజ క్లారిటీ ఇవ్వలేదు.