అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటేనే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోతాయి. బాలయ్య స్టామినాకు తగ్గట్టుగా కథ.. స్క్రీన్‌ ప్రజెంట్ చూయ‌డంలో బోయపాటి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నందమూరి అభిమానుల అంచనా. బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన రేంజ్ లో సక్సెస్‌లు అందకపోయినా.. బాలయ్యతో మాత్రం దాదాపు తెర‌కెక్కించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పటివరకు బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ స‌క్స‌స్‌ అందుకున్నాయి. ఇక అఖండ మూవీ అయితే రికార్డ్‌ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా అఖండ రికార్డ్ సృష్టించింది. ప్రజలకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే దైవాన్ని మెయిన్ ఫ్యాక్టర్‌గా తీసుకొని.. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో కథను రూపొందించాడు బోయపాటి.

Akhanda Full Movie Online in HD in Telugu on Hotstar CA

దీంతో సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే బోయపాటి అఖండ.. సిక్వెల్‌ని ప్రారంభించనున్నాడు. ఇప్పటికే సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బాబు డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో బిజీగా గడుపుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. దీంతో బాబీ సినిమా పూర్తయిన వెంటనే.. బోయపాటి డైరెక్షన్‌లో అఖండ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని టాక్. త్వ‌ర‌లో ఈ సినిమా షూట్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే రిలీజ్ డేట్‌కు కూడా యూనిట్ ప్లాన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. అఖండను డిసెంబర్ 2న రిలీజ్ చేశారు. అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ 2025 డిసెంబర్‌లో అఖండ 2 కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ డిసెంబర్‌లో రిలీజ్ కాకపోతే.. 2026 జనవరి సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు సినిమాని తీసుకొచ్చేలా బోయపాటి ఆలోచనలో ఉన్నాడట.

ఈ రెండు నెలల్లో ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక టాలీవుడ్ లో సంక్రాంతి రేస్ అంటేనే భారీ పండుగ. వరుస భారీ బడ్జెట్ సినిమాలు ముందేలైన‌ప్‌ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి క్రమంలో 2026 సంక్రాంతి అంటే చాలా పాన్ ఇండియన్ మూవీస్ బాలయ్య సినిమాతో తలపడే ఛాన్స్ ఉంది. ఇక అఖండ 2ని కూడా బోయపాటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించనున్నారు. అయితే ఇమేజ్ పరంగా బాలయ్య పాన్ ఇండియన్ స్టార్ల సినిమాలతో పోటీ పడగలరా అనే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా వస్తున్న సినిమా కాబట్టి.. ఆడియన్స్ లో విపరీతంగా హైప్‌ ఉంటుంది. అలాగే బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సినిమా రెడీ అవుతున్న క్రమంలో సినిమాకు మేకర్స్ కూడా భారీ లెవెల్ లో హైప్ క్రియేట్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే అఖండ 2 రిలీజ్ ఎప్పుడు ఉన్న ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ కాయమంటూ ట్రేడ్ వర్గాల‌ అంచనాలు చెబుతున్నాయి.