మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటు కీలక పాత్రలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన సినిమాలు పరంగానే కాదు.. రాజకీయాల పరంగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్న నాగబాబు.. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్థాయిలో సపోర్ట్ అందిస్తూ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో మద్దతు ఇచ్చిన త్వరలోనే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. ఓ న్యూస్ ఛానల్ పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా యన్ మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నానట్లు అఫీషియల్ ప్రకటన చేశారు. యన్ మీడియా లోగో రివిల్ చేస్తూ ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి యన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించబోతున్నానని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ యన్ మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్, భక్తి న్యూస్లు మాత్రమే ప్రసారం అవుతాయట. అయితే భవిష్యత్తులో తన మీడియా ఛానల్ మరింత అభివృద్ధి చేయబోతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ ఛానల్ పై పొలిటికల్ న్యూస్ తో పాటు.. ఓ వెబ్సైట్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటినుంచి యన్ మీడియాని స్థాపించి మళ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ.. ఆ ఛానల్ ద్వారా పొలిటికల్ న్యూస్ ప్రచారం చేయబోతున్నారట. కేవలం యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ తోనే నాగబాబు సరిపెడతారా.. లేదా.. శాటిలైట్ ఛానల్ ద్వారా కూడా తన మీడియా సంస్థను అభివృద్ధి చేస్తారా.. అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ప్రస్తుతం నాగబాబు స్థాపించిన ఈ యన్ మీడియాను అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ పోతే.. జనసేనకు ఇక తిరుగుండదు అంటూ కమెంట్లు వినిపిస్తున్నాయి.