ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ఎలా ఉంటుందో.. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక నేడు ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. దేవర మూవీ టీమ్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ.. ఆయనకు సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేశారు.
అయితే ఈ గ్లింప్స్ తో మేకర్స్ ఆడియన్స్ కు రెండు ట్విస్ట్‌లు ఇచ్చారు. అదేంటంటే ఈ సినిమాల సైఫ్ అలీ ఖాన్ రెండు లుక్స్ లో కనిపించడమే. ఒక లుక్ మీడియమ్ ఏజ్ యంగ్ పవర్‌ఫుల్ లుక్. మరొకటి పొడవాటి జుట్టుతో షార్ట్ హెయిర్ కట్‌తో సైఫ్ అలీ ఖాన్ కనిపించడం. ఇక దేవర సినిమాలో బైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారని యూనిట్ వివరించింది. బర్త్డే గ్లింప్స్ ద్వారా మొదట ఆయుధ పూజను చూపించిన మేకర్స్.. రకరకాల కత్తులు.. ప్రజలంతా కలిసి తమ దైవానికి మొక్కడం.. లాంటి సన్నివేశాలను చూపించారు. తర్వాత భైరవ ఎంట్రీ.. ఆలయంలో భైరా, బైరా అంటూ ప్రజలు జేజేల మధ్యన సైఫ్ అలీ ఖాన్ ఇంట్రడక్షన్ ఇచ్చారు.
ఇక ఆయన వేట తరతరాలు చెప్పుకుంటాయి అన్నట్లుగా ఓ సింపుల్ కొటేషన్ వివరించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రెండు పాత్రలో నటిస్తున్నారా.. లేదా ఒకే పాత్రలో రెండు లుక్స్ తో కనిపించబోతున్నాడా అనేది ప్రేక్షకులకు సస్పెన్స్ గా ఉంచారు. ఇక ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడుకు తెలుగు మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ తో పాటు.. బాబి డియోల్ కూడా ఓ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్‌లో.. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.