ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు అంతా ఎక్కువ శాతం బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు ఆశ చూపుతూ ఉంటారు.
అందులో భాగంగా తెలుగులో సక్సెస్ వచ్చాక.. అక్కడకు వెళ్లిపోయి సెటిల్ అయినా వారు చాలామంది ఉన్నారు. ఇక పోతే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న వారిలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకటి. తన అద్భుతమైన నటనతో.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ యంగ్ బ్యూటీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందట. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో కొంతమంది బాటీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో టాలీవుడ్ స్టార్ బ్యూటీగా దూసుకుపోయిన రకుల్ ప్రీత్, ఇలియానాలు కూడా ఉన్నారు.
వీరు తెలుగులో సక్సెస్ అయిన తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయారు. అక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా వీరికి విజయం దక్కకపోవడంతో.. తర్వాత క్రేజ్ తగ్గిపోయింది. మరి ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్నశ్రీలీల కూడా బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు అవకాశాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా హిట్ అయితే ఓకే. లేదంటే తెలుగులో కూడా ఈమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయి ఈమె పరిస్థితి కూడా వారికిలా అయ్యే ప్రమాదం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి.