మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ” ఇండియన్ 2 ” లో రామ్ చరణ్..!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి ఆర్‌ఆర్ఆర్ తో వచ్చిన ఆనందం ఆచార్య వల్ల తుసుమనిపించాడు చరణ్. అందుకే చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

Indian 2 (soundtrack) - Wikipedia

ఎప్పటికప్పుడు మూవీ డీటెయిల్స్ ను వెల్లడించడంపై మేకర్స్ మరింత ఆలస్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు.. శంకర్‌పై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ కంటే ముందే చరణ్ మరో సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. శంకర్ గేమ్ చేంజర్ సినిమాను ఆలస్యం చేయడానికి కారణం ఇండియన్ 2 అన్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 షూటింగ్ వివాదాల కారణంగా ప్రొడక్షన్‌కు కాస్త బ్రేక్ పడింది. దీంతో ఇండియన్ 2 ను ఆపేసి గేమ్ చేంజర్ సినిమా మొదలుపెట్టాడు శంకర్.

Ram Charan, Shankar's 'Game Changer' shoot cancelled at the last minute.  Here's why - India Today

అయితే గేమ్ చేంజర్ కొంత భాగం పూర్తయ్యేసరికి అనుకోకుండా వివాదాలు సద్దుమనగడం.. దీంతో ఇండియన్ 2 పై మళ్ళి ఫోకస్ పెట్టాడు. ఈ ప్రభావం గేమ్ చేంజ‌ర్‌పై ప‌డ‌టంతో సినిమా బాగా ఆలస్యం అయింది. దీంతో ఇండియన్ 2పై, డైరెక్టర్ శంకర్ పై నిన్న మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ తెగ మండిపడ్డారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 చరణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనుంది. ఇండియన్ 2లో రాంచరణ్ గెస్ట్ రోల్ లో మెరువనున్నాడని.. కనిపించేది కాసేపే ఆయినా అది సినిమాలో కాస్త హైలెట్ పాత్ర అంటూ తెలుస్తుంది. చరణ్ ఫాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఆ గెస్ట్ రోల్ ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియాలంటే జూలై 12 వరకు వేచి చూడాల్సిందే.