ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా రాణించాలన్న.. అదే ఫేమ్‌ను కొనసాగించాలనా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అహర్నిశలు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ అంతా ఒకటి రెండు హిట్స్ పడగానే భారీ రెమ్యనరేషన్‌ను డిమాండ్ చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు అలుక్కోవాలి అనే సామెతను ఫాలో అవుతున్నారు. ఇంతకి ఈ పై ఫోటోలో బొద్దుగా, ముద్దొస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు. చిన్న వయసులోనే కోట్ల అస్తిని కూడా పెట్టింది. 27 ఏళ్ల ఈ పడుచు తన సినీ కెరీర్‌లో ఒక్కసారైనా సక్సెస్ కూడా అందుకోకపోయినా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది.
ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా అదరగొడుతుంది. వరుస సినిమాలు నటిస్తూ కోట్లు సంపాదిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. మొదటి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ పక్కన బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలతో పాటు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. వైవిద్యకథలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ మాత్రం రాలేదు. ఇక సోషల్ మీడియాలో జాన్వి ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. కోట్లాదిమంది యువతను కవ్విస్తోంది.
అయితే ఇటీవల టాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైన జాన్వి ప్రస్తుతం టాలీవుడ్ గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న తారక్, రామ్ చరణ్ సరసన సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకొని ఒక్కసారిగా పాపులర్ అయ్యిపోయింది. ఓ పక్క తారక్ దేవర సినిమాలో నటిస్తూనే.. ఈ సినిమా రిలీజ్ కాకముందే రామ్ చరణ్ సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక జాన్వి తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ గా కోట్లు సంపాదించినప్పటికీ.. ఆమె మాత్రం తన సొంత డబ్బుతో లైఫ్ని లీడ్ చేయాలని భావిస్తుంది. ఇటీవలే ఒక అరీదైన బంగ్లాను కొన్న ఈ అమ్మడు దగ్గర ఇప్పటికే ఎన్నో కాస్ట్లీ కార్లు ఉన్నాయి. విలాసవంతమైన లైఫ్ గడుపుతున్న జాన్వి.. తాజాగా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.