జూనియర్ ఎన్టీఆర్, శ్రీ లీల మధ్య ఏకంగా ఇన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయా.. అవి ఏంటంటే..?!

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్‌ ఇండియా లెవెల్ లో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా భారీ పాపులాటి దక్కించుకున్న శ్రీ‌లీలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికే స్టార్ హీరో బాలకృష్ణ తో శ్రీ‌లీల‌ భగవంత్‌కేసరి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీల కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్దరి మధ్యన ఉన్ని కామన్ క్వాలిటీస్ ఇవే అంటూ ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది.

Jr NTR | King 👑 Of Dance 😎 @jrntr ❣️ . Do Follow 👉 @NTR_Admirers  @NTR_Admirers @NTR_Admirers @NTR_Admirers @NTR_Admirers @NTR_Admirers  @NTR_Admirers... | Instagram

ఇంతకీ తారక్, శ్రీలీల మధ్యన ఉన్న ఆ కామన్ క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్, శ్రీ‌లీల‌ ఇద్దరు డ్యాన్స్ పరంగా ఆధార‌గొడతారు. ఎటువంటి కష్టతరమైన స్టెప్స్ అయినా ఇట్టే వేసి తమ సత్తా చాటుతారు. అలాగే తారక్, ఎన్టీఆర్ ఇద్దరికీ కర్ణాటక రాష్ట్రంతో మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కర్ణాటక మూలాలు కలిగిన వ్యక్తులే. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్ణాటక. అలాగే శ్రీ‌లీల‌ది కూడా కర్ణాటక అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు క్వాలిటీస్ తో పాటు తారక్ శ్రీలీల ఇద్దరూ ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటారు.

Sreeleela`s Electrifying Dance

ప్రస్తుతం వీరిద్దరిలో ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ ని హైలెట్ చేస్తూ.. తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని.. అన్నిటికన్నా వీరిద్దరి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ గా ఉంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక‌ ఎన్టీఆర్, శ్రీ లీల ఇద్రు ఇప్పటికే తమ నట‌న‌తో ఎన్నో అవార్డులను దక్కించుకొని దూసుకుపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించే అవకాశం వస్తే శ్రీ లీలా నో చెప్తే చాన్సే లేదు. ఎన్టీఆర్ తలుచుకుంటే ఈ కాంబినేషన్లో సినిమా రావడం అంత కష్టం కూడా కాదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పటికీ సినిమా వస్తుందో.. తారక్ అభిమానుల కోరికను ఎప్పటికీ తీరుస్తాడో చూడాలి.