అకిరా విషయంలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే కచ్చితంగా ఆ పేరు పక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అన్న పేరు వినపడుతూనే ఉంటుంది . అలాంటి జాన్ జిగిడి దోస్తు ఫ్రెండ్ షిప్ వీళ్లది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు .. ఎన్నెన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. వీళ్ళని విడదీయడానికి ఎంతో మంది కూడా ట్రై చేశారు . కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు.. వీళ్లు అంత స్ట్రాంగ్ గా తమ ఫ్రెండ్షిప్ విలువలను విధివిధానాలను నమ్ముతూ ఉంటారు .

త్రివిక్రమ్ ఏమి చేసినా పవన్ కి తెలుస్తుంది ..పవన్ ఏం చేసిన త్రివిక్రమ్ కారణంగానే ..అది ముందుకు వెళుతుంది . ఈ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ లో అర్థ భాగమే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ చాలామంది ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు . వీళ్ళ లాంటి ఫ్రెండ్షిప్ అందరూ చేస్తే బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. భారీ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం పవన్ ఫ్యాన్స్ కు మరింత హ్యాపీనెస్ ఇచ్చింది .

మరి కొద్ది రోజుల్లోనే మనం మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నాం.. అయితే ఇప్పుడు అకిరా పేరు మారుమ్రోగిపోతుంది . పవన్ ఎక్కడికి వెళ్లినా సరే అకిరాని వెంటబెట్టుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే కొడుకుని ఇక జనాలకు దగ్గర చేసే పనిలో బిజీ అయిపోయాడు పవన్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హీరోగా అఖీరాను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట పవన్ కళ్యాణ్ . అయితే అకిరాను ఇంట్రడ్యూస్ చేస్తే కచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది అనుకున్నారు ఫాన్స్ .. కానీ త్రివిక్రమ్ కి షాక్ ఇస్తూ ఆ బాధ్యతలను పూరి జగన్నాథ్ చేతిలో పెట్టాడట .. బద్రి లాంటి సినిమాను అకిరా ఖాతాలో వెయ్యాలి అంటూ ప్రామిస్ కూడా తీసుకున్నాడట.. ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!