వామ్మో.. చంద్రబాబు కొత్త కాన్వాయ్ లు చూశారా.. స్పెషాలిటీస్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

కేవలం రెండంటే రెండు రోజులే ..రెండు రోజుల్లోనే నారా చంద్రబాబునాయుడు నాలుగవసారి “నారా చంద్రబాబు నాయుడు అనే నేను” అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు . రీసెంట్ గా జరిగిన ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించి .. వైసిపిని క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి అధికారం చేపట్టే దిశగా పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ ప్రతిదీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.

ఈ క్రమంలోనే వైసిపి ఓడించి ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది . జూన్ 12వ తేదీ బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు . ఈ వేడుక కోసం గన్నవరం విమానశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదిక కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసేశారు పెద్దలు. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉండే టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు . ఈ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన భద్రత హైలెట్ గా మారింది . ఇందులో భాగంగా చంద్రబాబు కోసం ఇంటెలిజెన్స్ 11 ఫార్చ్యూనర్ కారు లని సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ 393 అంటూ తెలుస్తుంది . ఆ వాహనాల రంగు నలుపు . కాగా చంద్రబాబుకు ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హైలెట్గా మారింది..!!