బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలన్న సంగతే నాకు తెలియదు.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్.. ?!

మెగా డాట‌ర్‌ నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు మొద‌ట‌ హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాక‌పోవ‌డంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. నిహారిక‌కు మ్యారేజ్ లైఫ్ కూడా స‌క్స‌స్ కాలేదు. దీంతో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక మరోసారి కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు.. ప్రొడ్యూసర్ గా మారి పలు వెబ్ సిరీస్ లతో పాటు.. సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

The 'Committee Kurrollu' completed the filming very soon – TFPC

ఈ క్రమంలో తాజాగా ” కమిటీ కుర్రోళ్ళు ” సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఇక ఈ సినిమాల్లో చైల్డ్ హుడ్ నుంచి టీనేజ్ వరకు కుర్రాళ్ళు ఎదుర్కొనే శారీరక, మానసిక స‌మ‌స్య‌ల‌నుంచి వారి గ్రామాల్లో ఆటలు, కొట్లాటలు, కుర్రాళ్ళ ప్రవర్తన ఇలా అన్నీ కోణాలను ఆవిష్కరిస్తూ సినిమాను రూపొందించారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో నిహారిక పాల్గొని సందడి చేసింది. ఈ సినిమాల్లో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు అనిపించే సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని విలేకరులు నిహారిక‌ను ప్రశ్నించగా దానికి సమాధానం చెప్తూనే.. తను చిన్నగా ఉన్నప్పుడు ఫిలిం చాంబార్‌లో బ్రేక్ సమయంలో స్నాక్స్ కోసం ఎగబడిన సందర్భాలు చాలా బాగున్నాయని.. అవి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అనిపిస్తుంది అంటూ వివరించింది.

Niharika Konidela Saagu Movie Press Meet | Vinay Ratnam | Harika Balla |  Vamsi Tummala - YouTube

అంతేకాదు తను చిన్నప్పుడు చిరంజీవిని ఒక్కరే హీరో అనుకునేదాన్ని.. ఎక్కువగా పెదనాన్న సినిమాలు మాత్రమే చూసేదాని అంటూ వివరించింది. బాల కృష్ణ‌, నాగార్జున, వెంకటేష్ లు కూడా హీరోలని అప్పుడు నాకు తెలియదని.. అసలు వాళ్లు కూడా హీరోలుగా సినిమాలు తీస్తారు అనుకోలేదని చెప్పుకొచ్చింది. వాళ్ళ సినిమాలు చూడకపోవడం వల్లే ఆ విషయం నాకు తెలియలేదు అంటూ వివరించింది. కానీ తర్వాత మెల్లమెల్లగా రామానాయుడు స్టూడియో, ఛాంబర్లలో వాళ్ళ సినిమాలు కూడా చూడడం మొదలుపెట్టాక వీళ్ళు కూడా హీరోలేనా అనుకున్న అంటూ ఫన్నీగా వివరించింది. ప్రజెంట్ నిహారిక చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.