చ‌ర‌ణ్, బుచ్చిబాబు మూవీలో జాన్వితో పాటు మ‌రో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో అస‌లు ఊహించ‌లేరు..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్.. శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుందంటూ తెలుస్తుంది. సినిమా చివరికి షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లి అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు చ‌ర‌ణ్‌. ఇక గేమ్ చేంజర్‌ తర్వాత.. రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటించనున్నాడు. ఆర్సి 16 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

Ram Charan Shares Photos With Janhvi Kapoor After RC16 Announcement, Says  'Looking Forward To...' - News18

ఈ సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్గా నటించనున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా నెటింట వైరల్‌గా మారాయి. అయితే తాజాగా జాన్వి తో పాటు మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా చరణ్ స‌రసన నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ జాక్పాట్ కొట్టేసిన స్టార్ బ్యూటీ మరెవరో కాదు పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న రష్మిక మందన. చరణ్ ఆర్సి 16 లోను రష్మిక సెకండ్ హీరోయిన్గా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Rashmika Mandanna - Wikipedia

ఇప్పటికే యానిమల్, పుష్పతో తన సత్తా చాటుకున్న రష్మిక.. పుష్ప 2తో మరోసారి సక్సెస్ అందుకొని తన రేంజ్ మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు తాజాగా ఆర్‌సీ16 లో కూడా రష్మికకు అవకాశం వచ్చిందని తెలియడంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే చరణ్ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కూడా నటిస్తుందంటూ అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే ఆర్ సి 16 టీమ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.