తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ రామ్ చరణ్ చేసిన ఒక్క ట్వీట్ ఇప్పుడు ఆయననే కాదు ఆయన తండ్రి మెగాస్టార్ ని సైతం సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్కి గురయ్యాలా చేస్తుంది. మనకు తెలిసిందే.. నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు తన 41వ పుట్టినరోజున చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే తారక్ బర్త డే సందర్భంగా రామ్ చరణ్ హ్యాపీ బర్త్డ డే మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ విష్ చేశాడు .
ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన ఒక పిక్ ని షేర్ చేశారు . అయితే బన్నీ మాత్రం తారక్ నటించిన దేవర సినిమాలోని ఫియర్ సాంగ్ ని పొగిడేస్తూ హ్యాపీ బర్త్డ డే బావ అంటూ ఓ రేంజ్ లో విష్ చేశాడు. అప్పుడే అల్లు ఫాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయి .. నందమూరి – మెగా ఫాన్స్ మధ్య రచ్చ మొదలయ్యేలా చేశాయి ..కాగా కొడుకుని ట్రోలింగ్ చేస్తుంటే సరికి ఆ తప్పును కవర్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ని పొగిడేస్తూ ట్వీట్ చేశాడు .
“ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో ఎవరు లేరు అని .. కలలు అందరూ కంటారు .. కానీ అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు.. కళా రంగంలో అలాంటి నిత్య కృషివలు తారక్ కి జన్మదిన శుభాకాంక్షలు “అంటూ పోస్ట్ చేశారు.దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కావాలనే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ ని పొగుడుతూ ఈ రేంజ్ లో ట్విట్ చేశాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి కొందరు కొడుకు తప్పు చేయడం తండ్రి సరిదిద్దడం ఈ మెగా ఫ్యామిలీ సాంప్రదాయం ఏంటో అంటూ వ్యంగంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!
కలలు అందరికి ఉంటాయి. అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు. కళారంగం లో అలాంటి నిత్యకృషీవలుడు తారక్ @tarak9999 కి జన్మదిన శుభాకాంక్షలు.🎂💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 20, 2024