“ప్లీజ్..దయ చేసి ఆ పని చేయండి”..కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ఏ ఆడపడుచుకైనా ..ఏ అబ్బాయి కైనా ఎలాంటి వాళ్లకైనా సరే ఆయనే ఓ ఇన్స్పిరేషన్ ..అటు సినిమా ఇండస్ట్రీని ఇటు రాజకీయాలను సమాంతరంగా ఏలేసిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు . ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు.. వెల్ విషర్స్.. శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ,

కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఆయనతో ఉన్న స్పెషల్ బంధాన్ని గుర్తు చేసుకున్నారు . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు . ఈ క్రమంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

ఆయన ట్వీట్టర్ ఖాతాలో ..”కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అని చిరంజీవి కామెంట్ చేశారు…!!