అతి చేయకుండా నోరు మూసుకుని ఆ పని చెయ్.. జక్కన్న పై ఫైర్ అయినా స్టార్.. కారణం ఏంటంటే..?!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిన్న ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి అంచ‌టంచ‌టుగా ఎదుగుతూ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ రిత్యా అయ‌న‌పై నెగటివ్ కామెంట్ చేయడానికి ఎవరు సాహసం చేయలేరు. అలాంటిది ఒక స్టార్ సెలబ్రిటీ రాజమౌళిని నోరు మూసుకుని చెప్పింది చెయ్ అంటూ ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ రాజమౌళిని అంతలా తిట్టిన ఆ వ్యక్తి ఎవరు.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇటీవల జరిగిన నా ఉచ్ఛ్వాసం కవనం అనే కార్యక్రమంలో జ‌క్క‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసిన సిరివెన్నెల మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వివరించాడు.

ఈ ఈవెంట్‌లో మా ఫ్యామిలీలో అందరికీ మా పెద్దనాన్న పేరు పెట్టారని జక్కన్న చెప్పుకొచ్చాడు. నా పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి అని ఆయన పెట్టారని.. మా పేర్లు వింటే మాకు చాలా గర్వంగా అనిపిస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. నా కూతురికి కూడా అలాంటి పేరే పెట్టాలని అనుకున్నా.. మయూక అనే పేరు పెట్టానంటూ వివరించాడు. అయితే నాకు పద్మశ్రీ వచ్చిన టైంలో పద్మశ్రీ తీసుకోవడానికి వెళ్లకూడదని నేను భావించానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రికి చెప్పితే.. భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీ కి అర్హుడవని భావించి పురస్కారం ఇస్తుంటే తీసుకోవా అని మందలించారని వివ‌రించాడు రాజమౌళి.

అతి వేషాలు వేయకుండా నోరు మూసుకుని వెళ్లి అవార్డు తీసుకో అని శాస్త్రి గారు కోపంగా చెప్పారని.. దీంతో ఆ వేడుకకు వెళ్ళానంటూ వివ‌రించాడు రాజమౌళి. మర్యాద రామన్నలో పరుగులుతీయ్‌ పాట నాకు ఎంతో ఇష్టమని.. ఆ పాటను సీతారామశాస్త్రి గారే రాశారంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. దీంతో రాజమౌళి ఇటీవల చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి అయిన రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.