అభిమానులకి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బన్నీ బ్యూటీ.. హల్దీ ఫోటోలు వైరల్..!

బన్నీ బ్యూటీగా పోపులారిటి సంపాదించుకున్న పూజ హెగ్డే పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . కారణం తాజాగా ఆమె నటించడం ఒక అడ్వర్టైజ్మెంట్. మనకు తెలిసిందే.. రీసెంట్గా ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే ఆఫర్ లు రాకుండా బాగా అల్లాడిపోయింది. ఎలా అంటే చేతికి వచ్చినట్టే వచ్చి మంచి మంచి ఆఫర్స్ అగిపోయాయి . కాగా రీసెంట్గా పూజా హెగ్డే ఒక ప్రముఖ నగల కంపెనీ యాడ్లో నటించింది .

చాలా నవ్వుతూ చక్కగా కనిపించిన పూజ హెగ్డే పెళ్లికూతురు గెటప్లో నగలు వేసుకొని హల్దీ ఫంక్షన్ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . భీమా గోల్డ్ బ్రైడల్ జ్యూవెలరీలో కి సంబంధించిన యాడ్ లో నటించింది పూజ హెగ్డే . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే పూజా హెగ్డే ప్రెసెంట్ తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఎక్కడ అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

కాగా ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలలో నటించి మెప్పించింది . అంతేకాదు పూజా హెగ్డే బన్నీ సరసన రెండు సినిమాల్లో నటించి బన్నీ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుని మరి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. త్వరలోనే రవితేజ నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా చేయబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)