“కల్కి 2898AD” సినిమాలో ఆయన కూడా.. ఫ్యాన్స్ కి బిగ్ ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తమ సినిమాల విషయంలో ఎలా లాస్ట్ మినిట్లో షాకింగ్ ఇస్తున్నారో మనకు బాగా తెలిసిందే . మరీ ముఖ్యంగా కొంతమంది డైరెక్టర్స్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజీ క్రేజీ రికార్డ్స్ నెలకొల్పడానికి సరికొత్త కాంబోస్ ని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు మన నాగ్ అశ్వీన్.. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో టాప్ డైరెక్టర్గా మారిపోయిన నాగ్ అశ్వీన్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్తో కల్కి సినిమాను తెరకెక్కించారు .

మరి కొద్దిగా గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరగబోతుంది . ఈ ఈవెంట్లో అఫీషియల్ గా తన బుజ్జిని అందరికీ పరిచయం చేయబోతున్నాడు ప్రభాస్ . కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో కల్కి సినిమాకి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కల్కి సినిమాలో కమల్ హాసన్ – అమితాబచ్చన్ కాకుండా మరొక స్టార్ హీరో కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారట. ఆయన మరెవరో కాదు మెగా స్టార్ చిరంజీవి . ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి కల్కి సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట. నాగ్ అశ్వీన్ ఈ గెస్ట్ పాత్రను చాలా చాలా స్పెషల్గా డిజైన్ చేశారట . కచ్చితంగా తెరపై మెగాస్టార్ చిరంజీవిని చూసిన వాళ్లకి గూస్ బంప్స్ రావడం పక్కా అంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అందాల ముద్దుగుమ్మలు దిశాపటాని, దిపీక పదుకొనే నటిస్తున్నారు. ఈ సినిమా పై అభిమానులు హ్యూజ్ స్ధాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు..!!