ఈ ప్రశాంత్ నీల్ గాడు..మరో శంకర్ లా తయారైయ్యాడే.. ఈ పనులు ఏంటి సార్..?

పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ప్రశాంత్ నీల్ ఏదో తలుచుకొని.. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ..ఏదో అనౌన్స్మెంట్ ఇస్తే .. జనాలకు మరొకలా అర్థమైంది . దీంతో ఆయన పేరు హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ ..తెరకెక్కించింది చాలా తక్కువ సినిమాలే .. కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మాత్రం కెవ్వు కేక అనాల్సిందే. రాజమౌళి పక్కన కూర్చి వేసుకొని కూర్చునే స్థాయి సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్.

ప్రజెంట్ ప్రశాంత్ నీల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఒకపక్క నందమూరి ఫ్యాన్స్ మరొక పక్క రెబెల్ ఫాన్స్ ఆయనను ఆడేసుకుంటున్నారు. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి రాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.. ఇంతలోనే ఏమైందో ఏమో ఆ సినిమాను వెనక్కి నెట్టేసి ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాను అంటూ అఫీషియల్ ప్రకటన చేశాడు . అంతే ఒక్కసారిగా రెబల్ అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఆయనపై ఊగిపోయారు .

మా ప్రభాస్ సినిమాని ఆలస్యం చేస్తావా..? అంటూ మండిపడ్డారు . దీనితో రియలైజ్ అయిన ప్రశాంత్ నీల్ .. శంకర్ లా రెండు పడవల ప్రయాణం చేయబోతున్నాడట . ఓవైపు ఎన్టీఆర్ తో సినిమాను మరోవైపు సలార్ 2తో ప్రభాస్ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసేలా పక్కాగా రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకోరాబోతున్నారట. ఇది చాలా చాలా టఫ్ జాబ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలను తెరకెక్కించడమే గగనం ..అది కూడా ఇద్దరు పాన్ ఇండియా స్టేటస్ ఒక బిగ్ ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ .. ఎలా ఆ సినిమాలను తెరకెక్కించగలరు .. అది కూడా ప్రశాంత్ నీల్ లాంటి కమిట్మెంట్ గల డైరెక్టర్ తో నో..వే కచ్చితంగా ..శంకర్ ఇండియన్ 2 గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో ఇరుక్కున్నట్టే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ రెబల్ ఫ్యాన్స్ మధ్య ఇరుక్కుని ట్రోలింగ్ కి గురవుతారు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!