సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా బన్నీ చేసిన ఒక పని మెగా ఫ్యాన్స్ ను బాగా బాధ పెట్టింది . పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూనే మరొక పక్క వైసిపి క్యాండిడేట్ శిల్పా రవి తరపున ప్రచారం చేయడం అభిమానులకు మండిపోయేలా చేసింది . ఎంతలా అంటే సోషల్ మీడియాలో బన్నీ కూ మెగా ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు .పుష్ప2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకుంటావో చూస్తాం అంటూ ఆ సినిమాని ఫ్లాప్ చేస్తామంటూ స్ట్రైట్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు .
ఆఫ్ కోర్స్ వాటికి ఘాటుగా కౌంటర్స్ ఇచ్చారు బన్నీ ఫ్యాన్స్. తాజాగా నాగబాబు సైతం బన్నీ పై పరోక్షకంగా ట్విట్ చేసి ఆ వేడిని ఇంకా పెంచేశారు . బన్నీ సైతం అదేవిధంగా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు . అయితే ఎక్కడ కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . మెగా అల్లు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి ఓ స్టార్ హీరోనే కారణం అంటూ ప్రచారం జరుగుతుంది.
ఆ స్టార్ హీరోకి మెగా ఫ్యామిలీ అంటే పడదు .. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అంటే అస్సలకి పడదు. ఆ కారణంగా మెగా ఫ్యామిలీని దూరం పెట్టుకున్నాడు. అయితే అల్లు అర్జున్ ను మాత్రం బాగా ఫ్రెండ్షిప్ చేసి తన సినిమాలకు స్పెషల్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిపించుకున్నారు. అంతేకాదు కావాలనే అల్లు అర్జున్ కి లేనిపోనిటివి చెప్పి మెగా ఫ్యామిలీ నుండి దూరం చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఆ హీరోకి ఇదేం పోయేకాలం అంటూ ఫైర్ అవుతున్నారు , ఇప్పుడు కూడా బన్నీ మెగా ఫ్యామిలీ మధ్య వచ్చిన మనస్పర్ధలను ఇంకా పెంచడానికి చూస్తున్నాడట. ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి కరెక్ట్ పాయింట్ తో కరెక్ట్ లైన్ తో ఆ హీరోని కనిపెట్టేసి ఏకేస్తున్నారు మెగా ఫాన్స్ ..అల్లు ఫాన్స్ మాత్రం మెగా ఫాన్స్ వ్యాఖ్యలను తప్పుగా తీసుకుంటున్నారు..!!