ఈ నాటి బ్యూటీ తెలుగు కుర్రాళ్ళ లేటెస్ట్ క్రష్.. ఒక్క సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?!

గత కొంతకాలంగా తమిళ్, మలయాళ సినిమాలకు తెలుగు ఆడియన్స్‌లోను మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించడంతో అవే సినిమాలు తెలుగులోకి డ‌బ్ అయి ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి ఓ సూపర్ హిట్ సినిమాలో నటించి తెలుగు కుర్రాళ‌కు లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నాటి బ్యూటీ. ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే పాపులర్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం అభినయంతో వెండితెరపై మ్యాజిక్ చేసింది. అందమైన ప్రేమ కథతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తనే హీరోయిన్ భవ్య ట్రిక. తమిళ సూపర్ సక్సెస్ సాధించి తెలుగులో డబ్ అయిన‌ జో సినిమా హీరోయిన్. ఇటీవల సంక్రాంతి పండగ‌కి కోలీవుడ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ.. సూపర్ హిట్ సాధించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా భవ్య మెప్పించింది. 1997లో తమిళనాడులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి కోలివుడ్‌ డైరెక్టర్ దినేష్ పళ‌నివేల్‌ దర్శకత్వంలో కతీర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

2022లో ఈ సినిమా రిలీజ్ అయింది. తర్వాత ప్రభు శ్రీ‌నివాస్‌ డైరెక్షన్లో వచ్చిన డాలి సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ఏడాదిలో రిలీజైన జో మూవీతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. జో తో ఈ బ్యూటీ భారీ క్రేజ్ సంపాదించడమే కాదు.. యూత్ లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులోనూ భారీ ఆఫర్లను అందుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.