ఆ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిల్.. సుద్ధ ముద్దపప్పులే..!

ప్రతి ఒక్క మనిషి అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది జరగదు.. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో ఏదో ఒక విషయంలో నెగటివ్ యాంగిల్ అనేది ఉంటుంది . కొందరు హీరోలు బాగా నటిస్తే డాన్స్ బాగా చేయలేరు .. కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తే నటనపరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.. కొందరు హీరోలు ఫైట్స్ చేయలేకపోవచ్చు .. మరికొందరి హీరోలు ఫ్లోర్ స్టెప్స్ వేయలేకపోవచ్చు .. ఎవరికైనా సరే మనుషులు ఒక నెగటివ్ కోణం అనేది ఉంటుంది . అయితే మన టాలీవుడ్ హీరోలు అందరిలో ఉన్న ఒక నెగిటివ్ యాంగిల్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ కూడా అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ -ప్రభాస్ – అల్లు అర్జున్ – బన్నీ ఇలా ఒకరు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతో మంది హీరోస్ మన ఇండస్ట్రీలో మంచి మంచి హిట్స్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి . అయితే ఏ హీరో కూడా రొమాన్స్ విషయంలో పర్ఫెక్ట్ గా నటిస్తాడు అని చెప్పలేం .

చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ వరకు ఏ స్టార్ హీరో కూడా రొమాన్స్ విషయంలో అంత పర్ఫెక్ట్ కాదు .. ఏదో తెరపై నటించమంటే అలా నటిస్తారు కానీ ..బాలీవుడ్ – హాలీవుడ్ హీరోస్ ల లీనమైపోయి రొమాన్స్ లో మునిగి తేలరు . ఇప్పటివరకు అలాంటి సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు ఇండస్ట్రీలో రాకపోవడం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వచ్చే యంగ్ హీరోస్ రొమాన్స్ విషయంలో పిహెచ్డి చేసేస్తున్నారు . కానీ ఒకప్పటి స్టార్ హీరోస్ మాత్రం ఆ విషయంలో నిల్..ఇదే విషయాన్ని కొందరు ఘాటుగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్స్ అందరు ముద్దపప్పులని ఇప్పుడు వచ్చే జనరేషన్ వా వాళ్లకు సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు..!!