టాలీవుడ్‌లో తారక్‌ను టైగ‌ర్ అని పిల‌వ‌డానికి కార‌ణం అదేనా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భారీ పాపులారిటి దక్కించుకునే దూసుకుపోతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎటువంటి పాత్రనైనా ఇట్టే వదిలిపోయి నటించే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో తన నటనతో సత్తా చాటుకున్నాడు తారక్. అయితే తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఆసక్తిక‌రమైన కామెంట్స్ చేశాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.

RRR: Jr NTR Becomes A Global Phenomenon With SS Rajamouli Directorial

మొదట నక్క, తోడేలు తర్వాత పులితో వేటాడే సీన్లు గురించి ఎక్కడ నుంచి ఎక్కడికి పరిగెత్తాలో ముందే మార్కును గీసి ఎన్టీఆర్‌కు చేసి చెప్పామని.. ఎన్టీఆర్ పరిగెడుతున్న దిశగా కెమెరా ఫాలో అవుతుందని.. మేము యాక్షన్ చెప్పిన వెంటనే క్షణాల్లో వాయువేగంతో తారక్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడని.. తారక వేగాన్ని అందుకుంటూ ఎలా షూట్ చేయాలో మాకు అసలు తట్టేది కాదంటూ చెప్పుకొచ్చాడు. అయితే తారక్ అంత వేగంగా పరిగెత్తగలడని నేను అసలు గెస్ చేయలేదని.. ఇదే విషయాన్ని ఒకసారి నేను తారక్ దగ్గర అడగగా తాను బ్యాడ్మింటన్ ప్లేయర్‌న‌ని.. తన స్టామినా వెనుక సీక్రెట్ అదే అంటూ చెప్పాడని వివరించాడు సంథీల్‌ కుమార్.

RRR': The VFX of Bheem's Epic Tiger Fight Scene

ఎన్టీఆర్ వేగానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించాడు. అయితే ఈ సన్నివేశం బ‌ల్గేరియా ఫారెస్ట్ లో 12 రోజులపాటు శ్రమించి షూట్ చేశారని తెలుస్తోంది. తారక్ అంత వేగంగా పరిగెత్తగలడు కాబట్టే ఫ్యాన్స్ అతనిని టైగర్ అని పిలుస్తారని అనుకుంటున్నా అంటూ సెంథిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటికే తన యాక్టింగ్ టాలెంట్ అలాగే తన వ్యక్తిగత బిహేవియర్ తో కూడా తారక్‌ ఎంతో మంది ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన నటనతో సత్తా చాటుకున్నాడు.

KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) / X

తారక్‌ నటన టాలెంట్ గురించి ప‌లువురు సినీ ప్రముఖులు కామెంట్లు చేశారు. కాగా సెంథీల్‌ కుమార్ లాంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ ఎన్టీఆర్ ను ప్రశంసించడంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్న క్ర‌మంలో తారక్ మరోసారి బ్లాక్ బ‌స్టర్ కొట్టడం ఖాయం అంటూ దేవర సినిమా తర్వాత హ్యాట్రిక్ దిశగా అడుగులు వేయాలంటూ.. కోరుకుంటున్నామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రూ.400 కోట్లు రేంజ్‌లో బిజినెస్‌లు జరిగినట్లు సమాచారం.